Hair Growth tips: జుట్టు సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిష్కార మార్గాలను ఇక్కడ తెలుసుకోండి. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటిలోనే తయారు చేసుకునే విధానాలను ఇక్కడ గమనించండి.
Hair Growth tips: కరివేపాకుతో జుట్టు సమస్యలకు చెక్!
కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి నూనె నల్లగా మారే వరకు మరగించి వడపోసి రోజూ రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. పెరుగులో కరివేపాకు వేసి దానిని మిక్సీ పట్టించి జుట్టుకు రాసి గంట తర్వాత కడిగేయండి. దీంతో చుండ్రు సమస్య తగ్గుతుంది. కొబ్బరినూనెలో కరివేపాకు, మెంతిపొడి, కోసిన ఉల్లి పాయ ముక్కలు కలిపి పది నిమిషాలు ఉడికించి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి వేళ తలకు పట్టించి ఉదయం తలస్నానం చేస్తే జట్టు నల్లబడుతుంది.
అదే విధంగా జుట్టు రాలే సమస్యకు కర్పూరం కూడా బాగా పనిచేస్తుంది. కర్పూరం ఆయిల్‌ను ఛాతీపై మసాజ్ చేస్తే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. సాధారణ హెయిర్ ఆయిల్‌లో కొన్ని చుక్కల కర్పూరం నూనెను కలిపి మర్థన చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. తలలో పేలు నివారణకు కర్పూరం బాగా ఉపయోగపడుతుంది.
Hair Growth tips: జుట్టు తెల్లబడినవారు ఉసిరికాయ, నారింజ, నిమ్మ, ద్రాక్ష, టమాటా, మొలకలు, ఆకు కూరలు వంటివి ఎక్కువగా తినాలి. ఒక గ్లాసు నీటిలో ఉసిరికాయ రసాన్ని కలిపి రోజూ తాగాలి. ఎండిన ఉసిరికాయలను వేయించి మెత్తగా రుబ్బాలి. ఈ పొడిని హెన్నా పేస్ట్‌లో కలిపి జుట్టుకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల తెల్లపడటం తగ్గుతుంది.
తలస్నానం చేసే సమయం లేకపోతే ఒక టేబుల్ స్పూన్ టాల్కమ్ పౌడర్ లేదా మొక్కజొన్న పిండిని తీసుకుని జుట్టుకు పట్టించి దువ్వేసుకున్నా తలస్నానం చేసినట్టు కనిపిస్తుంది. అరటిపండ్లు, తేనే, పెరుగు, తక్కువ కొ వ్వు ఉన్న పాలు కలిపి తయారు చేసిన డ్రింక్‌ను కొన్ని వారాల పాటు తాగితే జుట్టు ఊడటం తగ్గిపోతుంది. తలస్నానం చేసిన తర్వాత చివరలో రెండు టేబుల్ స్పూన్ల మాల్ట్ మెనిగర్‌ను రాస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది.
జుట్టుకు కలబంద
జుట్టు (Hair Growth tips) కు కలబంద గుజ్జును రాసి కాసేపటి తర్వాత కడిగితే మెత్తగా, మృదువుగా మారుతుంది. ఈ గుజ్జు వల్ల జుట్టు ఊడకుండా, చుండరు తొలగిపోవడానికి సహాయపడుతుంది. కొబ్బరినూనె (Coconut Oil), కలబంద గుజ్జును సమానంగా కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని వారానిఇక 2,3 సార్లు రాసుకుని కాసేపు జుట్టును మసాజ్ చేసుకవాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టును కండిషనింగ్ చేయడంతో పాటు తలపై తేమను కాపాడుతుంది. అదే విధంగా కొంచెం గుంటగలగర ఆకు, మెంతులు, కలబంద(aloe vera), గోరింటాకు, కరివేపాకు కొబ్బరినూనెలో వేసి ఒక 15 నిమిషాలు మరిగించాలి. తర్వాత చల్లారబెట్టి ఒక బాటిల్‌లో పోసి నిల్వ చేసుకుని జుట్టకు రాసుకుంటే చాలా బాగా పెరుగుతుంది. జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది.