Guntur news గుంటూరు: social media లో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి వలవేసిన సత్తెనపల్లి కి చెందిన దంపతులు అతని వద్ద నుంచి పెళ్లి పేరుతో కోటి రూపాయలు స్వాహా చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎట్టకేలకు ఆ దంపతులిద్దర్నీ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో ఘరానా మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. సత్తెనపల్లికి చెందిన ఎర్రగుంట్ల దాసు (30) జ్యోతి(28) భార్య భర్తలు. దాసు బీటెక్ పూర్తి చేసి గతంలో టీసీఎయస్ కంపెనీలో ప్రైవేటు జాబ్ చేసి మానేసి సత్తెనపల్లిలో పండ్ల వ్యాపారం మొదలు పెట్టాడు. మూడు సంవత్సరాల క్రితం జ్యోతిని వివాహం(guntur news) చేసుకున్నాడు. వ్యాపారంలో లాభాలు రాకపోవడంతో easy money సంపాదనకు జల్సాలకు అలవాటు పడ్డారు దంపతులిద్దరూ. సోషల్ మీడియాలో ఫేస్బుక్లో fake Profile (కల్యాణి శ్రీ) పేరుతో సాప్ట్వేర్ ఉద్యోగికి వలవేశారు. దశల వారీగా కోటి రూపాలయు స్వాహా చేశారు. స్వాహా చేసిన సొత్తుతో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడ్డారు.
పెళ్లి పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి తనను మోసం చేశారని బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సత్తెనపల్లి పట్టణంలో నివాసముంటున్న భార్యభర్తలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!