Guntur Jinnah Tower Story గుంటూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా, గుంటూరు పట్టణం నడిబొడ్డున ఉన్న జిన్నా టవర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. ప్రతి రోజూ జిన్నా టవర్‌పై ఏదో ఒక వాదన బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ లేని విధంగా ఏపీలో బీజేపీ నేతలు జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేయడం ఇప్పుడు రాజకీయ చర్చతో పాటు, మత విద్వేషాలకు కూడా తావు కలిగించే విధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం బీజేపీ డిమాండ్‌ను వ్యతిరేకించింది. ఇన్ని సంవత్సరాలుగా జిన్నా టవర్ ఆకు పచ్చ రంగులతో ఉండగా. తాజా పరిణామాల నేపథ్యంలో ఆకు పచ్చ రంగులను తొలగించి భారత జాతీయ జెండా మూడు రంగులను వేయించారు స్థానిక గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (Guntur Jinnah Tower Story) ప్రతినిధులు.
జిన్నా టవర్ నేపథ్యం?
ఏపీలో ఉన్న గుంటూరు జిన్నా టవర్ ఇప్పటిది కాదు. 1942 సంవత్సరంలో గుంటూరులోని మతఘర్షణలు చోటు చేసుకున్నప్పుడు అప్పటి కోర్టులో శిక్ష పడిన వారికి అండగా జిన్నా బొంబాయి హైకోర్టులో వాదించారు. అయితే పాకిస్థాన్ జాతిపితగా అనుకునే మహమ్మద్ అలీ జిన్నా పేరుతో ఈ టవర్ ను అప్పట్లో ఏర్పాటు చేశారు. టవర్ ను మత సామరస్యం పెంపొందించాలనే లక్ష్యంతోనే నిర్మించారు. అప్పటి గుంటూరు ఎమ్మెల్యే ఎస్.ఎం. లాల్ జాన్ బాషా చొరవతో నిర్మింతమైనప్పటికీ టవర్ ప్రారంభానికి మాత్రం జిన్నా రాలేకపోయారు. ఆయన స్థానంలో వారి ప్రధాన అనుచరుడు జుదా లియాఖత్ అలీఖాన్ ప్రారంభించారు.
కార్గిల్ యుద్ధ సమయంలో చర్చ!
కార్గిల్ యుద్ధం సమయంలో కూడా జిన్నా టవర్ గురించి చర్చ నడిచింది. 1964 సంవత్సరంలో జిన్నా టవర్ పేరు మార్చాలనే డిమాండ్ రావడం, అప్పటి కొందరు మున్సిపల్ కౌన్సిల్లో దానిని ప్రతిపాదించడం జరిగింది. కానీ అది ఆమోదానికి నోచుకోలేదు. 70 ఏళ్ల చరిత్ర కలిగిన జిన్నా టవర్ పేరుతో ఇండియాతో పాటు, అటు పాకిస్థాన్‌లోనూ ఏ నిర్మాణం లేకపోవడంతో ప్రపంచంలోనే జిన్నా టవర్ ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే గత నెల రోజులుగా ఏపీ బీజేపీ నేతలు జిన్నా టవర్ పేరు మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చని పక్షంలో కూల్చివేస్తామనే స్థాయిలో హెచ్చరికలు చేశారు. ఉన్నట్టుంటి జిన్నా టవర్‌పై వివాదం రాజుకుంది.

మూడు రంగులతో వివాదం సమిసిపోలేదా?
బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. మత రాజకీయాల కోసం ఇలాంటి వాదనలకు తెరలేపుతున్నారని కూడా జిల్లా వైసీపీ నేతలు విమర్శించారు. గణతంత్ర దినోత్సవం 2022 రోజున కొందరు యువకులు జిన్నా టవర్‌పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని చూసినప్పటికీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. జిన్నా టవర్ చుట్టూ ప్రస్తుతం ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పోలీసు పహారా కాస్తున్నారు. ఉన్నట్టుండి జిన్నా టవర్‌కు ప్రభుత్వం మూడు రంగులు పూయించింది. ఇంతటితో జిన్నా టవర్ చుట్టూ నెలకొన్న వివాదం ఇకనైనా సమసి పోతుందని ప్రభుత్వం, స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం పేరు మార్చాల్సిందేనని ఒంటి కాలిపై డిమాండ్ చేస్తుంది. మొత్తానికి వివాదం సమసి పోయిందా? అనేది ప్రశ్నార్థకంగానే మిగిలి ఉంది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!