Guntur Icon Jinnah Tower | గుంటూరు నగరంలోని జిన్నా టవర్ సెంటర్ వద్ద మత సామరస్యం కోసం ఏర్పాటు చేసిన 30 అడుగుల జాతీయ జెండా స్థానంలో గుంటూరు నగరానికి ఐకాన్‌లా ఉండాలనే ఉద్ధేశంతో 60 అడుగుల ఆధునికమైన పోల్ ఏర్పాటు చేశామని నగర పాలక సంస్థ మేయర్(kavati siva naga manohar naidu) కావటి శివ నాగ మనోహర్ నాయుడు(Guntur Icon Jinnah Tower) అన్నారు.
గురువారం జిన్నా టవర్ అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించి జెండా పోల్‌ను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిన్నా టవర్ సెంటర్ వద్ద నూతనంగా 60 అడుగుల జాతీయ జెండా పోల్ ఆధునికమైన హైమాస్ట్ పోల్(high mast light) ఏర్పాటు చేశామన్నారు. జిన్నా టవర్ సెంటర్ గుంటూరు నగరానికే ఐకాన్‌లా ఉండేలా ఆకర్షించేలా లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు.

జిన్నా టవర్ సెంటర్‌ను మతసామరస్యం వెల్లు విరిసేలా, జాతీయ భావం పెల్లు బికేలా జాతీయ జెండాను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు మహమ్మద్ హబీబ్ భాషా, షేక్ మీరావలి, యాట్ల రవికుమార్, షేక్ ఖాజా మొహిద్దీన్, బోడపాటి ఉషారాణి, కిషోర్ కుమార్, షేక్ మీరా వలి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ