Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం!
Guntur : గుంటూరు జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి దాడిచేసి పాశవికంగా అత్యాచారానికి వడిగట్టాడు. గుంటూరు లో నగరం పాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు మండలం కిష్కిందపాలెంకు చెందిన వృద్ధురాలు 15 ఏళ్లు క్రితం కూలి పనులు నిమిత్తం గుంటూరు నగరానికి వచ్చింది. కామాక్షి నగర్లో నివాసం ఉంటోంది. ఏడాది క్రితం ఆమె భర్త మృతి చెందాడు. ఆ వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉండగా, వీరిలో ఇద్దరు కుమారులు మృతి చెందారు. ప్రస్తుతం ఉన్న కుమారుడు, కుమార్తెలకు వివాహం కావడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో ఆ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది.


ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి తలుపులు కొట్టినట్టు శబ్ధం రావడంతో కుమారుడు వచ్చాడనుకుని ఆమె తలుపులు తీసింది. అప్పటికే పక్కా ప్లాన్ ప్రకారం వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేస్తున్నప్పటికీ నోరు మూసేసి చిత్రహింసలకు గురిచేశాడు. ఆ వ్యక్తి అక్కడ నుంచి పారిపోయిన తర్వాత స్పృహలోకి వచ్చిన వృద్ధురాలు ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేసింది. అనంతరం వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం