gun misfire: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సూర రజనీ కుమార్(29) అనే కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అవ్వడంతో ప్రాణాలు విడిచాడు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 4 గంటల 30 నిమిషాలకు కానిస్టేబుల్ రజనీ కుమార్ చేతిలోని గన్ మిస్ ఫైర్ అయ్యింది.
ఈ ఘటనలో బుల్లెట్ కానిస్టేబుల్ గొంతులోకి దూసుకెళ్లింది. సిబ్బంది అప్రమత్తమై గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే గన్ మిస్ ఫైర్ (gun misfire) ఎలా జరిగందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యానికి ప్రయత్నించాడా లేదా ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే సమాచారం తెలుసుకున్న జిల్లా SP సురేష్ కుమార్ కాగజ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌ను పరామర్శించారు.
gun misfire: మెరుగైన చికిత్స కోసం!
గాయపడ్డ కానిస్టేబుల్‌ను మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో కరీంనగర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ రజనీ కుమార్ మృతి చెందారు. మృతుడిది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని భటవాన్పల్లి అని తెలుస్తోంది. కానిస్టేబుల్ మృతితో తోటి సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు.