Gujarat womens: పార్వతీపురం : ప్రధాన రహదారులపై ఒక ప్రదేశం వద్ద గ్యాంగ్‌గా దిగుతారు. రోడ్డుకు అటు, ఇటు వైపులా తిరుగుతూ ఏదో సమాజ సేవ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. రహదారిపైన వచ్చే వాహనాలను ఆపివేస్తారు. సమాజ సేవ చేస్తున్నాం! డబ్బులు ఇవ్వాల్సిందేనని వారి స్టైల్లో దబాయిస్తూ డబ్బులు గుంజుతారు. కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లాలో హల్ చల్ సృష్టించిన ఈ గుజరాతీ యువతు(Gujarat womens)ల గ్యాంగ్ ఇప్పుడు విజయనగరం జిల్లాలో కనిపించారు.
గుజరాత్‌కు చెందిన పలువురు యువతులు విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని ఓ లాడ్జిలో దిగారు. రెండురోజులుగా మకాం వేశారు. బ్యాచీలుగా విడిపోయి పట్టణ శివారు ప్రాంతాల్లోని రహదారులను పంచుకున్నారు. రోడ్లపైకి వచ్చే ద్విచక్రవాహనాలను ఆపుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరి వ్యవహారం స్థానికులు ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పార్వతీపురం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలను సేకరించి గుజరాత్‌కు చెందిన యువతులగా గుర్తించారు. కౌన్సిలింగ్ ఇచ్చి సొంత గ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రతిపాడు సమీపంలోనూ..!
కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపంలోనూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన 8 మంది యువకులను, వసూళ్ల దందాకు తెరదీశారు. ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయం సమీపంలో గుంటూరు ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనాలను బలవంతంగా ఆపి డబ్బులు వసూలు చేశారు. ప్రతి వాహనదారుడి నుంచి కనీసం రూ.500 పై బడి వసూలు చేసినట్టు స్థానిక ఎస్సై అశోక్ కు సమ ఆచారం అందింది. వెంటనే సిబ్బందితో కలిసి ఎస్సై అక్కడికి చేరుకున్నారు. వారి వివరాలను సేకరించారు. ఇలాంటి వసూళ్లు చట్ట విరుద్ధమని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?