Gudivada: Attack on poker sites in Gudivada | మంత్రికొడాలి నానిపై ప్రతిపక్షాల మాటల యుద్ధం!
Gudivada: Attack on poker sites in Gudivada | మంత్రికొడాలి నానిపై ప్రతిపక్షాల మాటల యుద్ధం!Gudivada: గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం తమిర్శ-దొండపాడు గ్రామాల మధ్య ఉన్న పేకాట స్థావరాలపై సోమవారం ఎస్ఈబీ పోలీసు అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోట్లల్లో డబ్బులతో పాటు 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మంత్రి కొడాలి నాని నే ఈ పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి కొడాలి నాని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దాడుల్లో పట్టుబడిన డబ్బులను బహిర్గతం చేయాలని, దీని వెనుక ఎంత మంది ఉన్నారో వారందర్నీ మీడియా ఎదుట హాజరు పర్చాలని డీజీపీని డిమాండ్ చేశారు.
Gudivada: Attack on poker sites|నాని అసలు
రంగు బయట పడింది: జనసేన
విజయవాడలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ మాట్లాడారు. మంత్రి కొడాలి నానిపై నిప్పులు చెరిగారు. బూతుల మంత్రి కాస్తా కోత ముక్కల కింగ్‌గా మారారని ఆరోపిం చారు. పంపకాల్లో తేడా వల్లే మెరుపు దాడులు జరిగాయని ఆరోపించారు. పేకాట క్లబ్బులు మూపించారని గొప్పలు చెప్పిన మంత్రి కొడాలి నాని ప్రజలకు సమాధానం చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. రూ.30 కోట్ల డబ్బు, 60 మందికిపైగా జూదగాళ్లు, పదుల సంఖ్యలో వాహనాలు పట్టుబడిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన జరిగిన వారం రోజుల్లోనే కొడాలి నాని నిజ స్వరూపం బయట పడిందని హెద్దేవా చేశారు. పోలీసు శాఖ రైడింగ్ అద్భుతంగా చేసిందన్నారు.
ఈ ఘటనపై డీజీపీ సవాంగ్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. దాడుల్లో పట్టకున్న నగదుతో పాటు బడా బాబుల పేర్లు, కార్ల వివరాలు, మంత్రి అనుచరుల వివరాలను బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. నాని ప్రధాన అనుచరులందరూ ఈ కేసులో ఉన్నారని ఆరోపించారు. కొల్లి విజయ్ అనే వ్యక్తితో పాటు యార్లగడ్డ బ్రదర్స్ నాని ఏజెంట్లుగా ఉంటూ పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వీరందర్నీ కేసు నుంచి తప్పించడానికే గుడివాడ పట్టణంలో అనేక అధికారిక కార్యక్రమాలను వదిలేసి తాడేపల్లి కార్యాలయానికి వెళ్లారని విమర్శించారు.
నందివాడ మండలంలోని తాగునీరు ఇప్పించలేని మంత్రి సారా కాయడానికి మాత్రం పెద్ద ఎత్తున అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. పేకాట క్లబులు, సారా అక్రమ అమ్మకాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని, లేకుంటే సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెయ్యి కోట్లు దోచుకున్న ఆ మంత్రిని ముఖ్యమంత్రి దండించకపోయినా భగవంతులు వదిలిపెట్టడని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 130 పైగా దేవాలయాల్లో దాడులు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. నందివాడ పోలీసులను స్ఫూర్తిగా తీసుకొని డీజీపీ రాష్ట్రంలో అక్రమ మద్యం, పేకాట శిబిరాలను నియంత్రించాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.
Gudivada: Attack on poker sites|మంత్రి కొడాలి నానినే ఆడిస్తున్నారు : మాజీమంత్రి దేవినేని ఉమా
మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. 19 నెలలుగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో విజయ్, మధు ఇద్దరు వ్యక్తుల పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారన్నారు. నిజాయతీ పరుడైన పోలీసు అధికారి 40 మంది పోలీసులతో వెళ్లి పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించారన్నారు. శిబిరంలోకి వెళ్లాలంటే రూ.5 వేలు ఫీజు అని, రూ.2 లక్షలు చూపిస్తేనే అనుమతి అని దేవినేని ఉమా ఆరోపించారు.
ఈ ఘటనలో 30 కార్లు ఉన్నాయని, 60 మంది రెడ్ హ్యాడెండ్‌గా దొరికారని అన్నారు. ఒక నిజాయతీ పరుడైన పోలీసు అధికారి మంత్రి కొడాలి నాని అరాచకాలను పులిస్టాఫ్ పెట్టారని విమర్శించారు. ఈ దాడుల్లో సంచుల్లో రూ.10 కోట్ల డబ్బు దొరికిందని అన్నారు. దాడుల తర్వాత పోలీసులను చంపేస్తామని బెదిరింపులు వెళుతున్నాయని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, మంత్రి కొడాలి నానిని సీఎం జగన్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ పేకాట మంత్రి కొడాలి నానినే ఆడిస్తున్నారని ఆరోపించారు.
Gudivada: Attack on poker sites|
తనపై కావాలనే ఆరోపణలు: కొడాలి నాని
మంత్రి కోడాలి నాని మాట్లాడుతూ.. తనను లక్ష్యంగా చేసుకున్న టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై కక్ష కట్టి బురద చల్లేందుకు టిడిపి, జనసేన పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తన నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు మూయించింది తానేనని అన్నారు. ప్రభుత్వము, తాను ఆదేశిస్తేనే పేకాట శిబిరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారని పేర్కొన్నారు. పేకాట ఆడేవారిని ప్రభుత్వం వదలిపెట్టబోదని స్పష్టం చేశారు.దొరికిన వారిలో మీ అనుచరులు ఉన్నారు కదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..ఉంటే ఏమవుతుంది. వారికి కూడా చట్టపరంగా శిక్షలు పడతాయని సమాధానం ఇచ్చారు.
ఇది చదవండి: WHO: మరో నాలుగు కొత్త వైరస్ లు