GST Rule Change:వ‌స్త్రాల వ్యాపారుల‌కు ఊర‌ట.. జీఎస్టీపై వెన‌క్కి త‌గ్గిన కేంద్రం

GST Rule Change:ఢిల్లీ 2022 నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా వ‌స్త్రాల‌పై భార‌త కేంద్ర ప్ర‌భుత్వం పెంచిన జీఎస్టీని త‌గ్గించింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మీడియా స‌మావేశంలో అధికారికంగా చెప్పాల్సి ఉంది. వ‌స్త్రాల‌పై జీఎస్టీ(వ‌స్తు సేవ‌ల ప‌న్ను) పెంపుపై దేశ‌వ్యాప్తంగా చేనేత‌, మ‌ర మ‌గ్గాల యాజ‌మాన్యాలు, కార్మికులు, అటు వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల వ్యాపారుల నుంచి వ్య‌తిరేక‌త‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం అనంత‌రం వ‌స్త్రాల‌పై జీఎస్టీ (GST Rule Change:)పెంపు త‌గ్గించిన‌ట్టు తెలుస్తోంది.

2022 జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి జీఎస్టీ పెంపు అమ‌లును జీఎస్టీ కౌన్సిల్ బుధ‌వారం ఏక‌గ్రీవంగా వాయిదా వేసింది. ప్ర‌స్తుతం టెక్స్ టైల్స్‌పై ఉన్న 5% శాతం జీఎస్టీని 12% శాతానికి పెంచుతూ గ‌త కౌన్సిల్ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి అమ‌లు చేయాల‌ని కూడా నిర్ణ‌యించారు.

Nirmala Sitharaman

అయితే శుక్ర‌వారం నాడు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్య‌క్ష‌న‌త 46వ జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో దీనిపై చ‌ర్చించి జీఎస్టీ పెంపు నిర్ణ‌యాన్ని వాయిదా వేయాల‌ని ఏక‌గ్రీవంగా నిర్ణ‌యించింది. 2020 ఫిబ్ర‌వ‌రి లో జ‌రిగే త‌దుప‌రి స‌మావేశంలో ఈ అంశాన్ని స‌మీక్షించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. స‌మావేశం నిర్ణ‌యాన్ని మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌రిగే పాత్రికేయుల స‌మావేశంలో నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలిసింది. శుక్ర‌వారం జ‌రిగిన జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఈ స‌మావేశం జ‌రుగుతుండ‌గానే గుజ‌రాత్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఢిల్లీ, రాజ‌స్థాన్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాలు జీఎస్టీని వ్య‌తిరేకించాయి. ఈ క్ర‌మంలో సూర‌త్‌(గుజ‌రాత్‌)లో వ‌స్త్ర దుకాణ వ్యాపారులు, నేత కార్మికులు బంద్ పాటించారు.

Share link

Leave a Comment