Green Tea Face Pack

Green Tea Face Pack గ్రీన్ టీ తాగ‌డానికే కాదు.. చ‌ర్మాన్ని మెరిసేలా చేసే సౌంద‌ర్య సాధ‌నం కూడా..!

Spread the love

Green Tea Face Pack మాన‌సికోల్లాసానికే కాదు. గ్రీన్ టీని సౌంద‌ర్య సాధ‌నం గానూ ఉప‌యోగిస్తే చ‌ర్మం మంచి నిగారింపును సంత‌రించుకుంటుంది. ప్యాకెట్ల‌లో ల‌భించే గ్రీన్ టీ ఆకుల‌ను ముద్ద‌గా చేసుకుని ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖ చ‌ర్మం కాంతివంత‌మ‌వుతుంద‌ని ప్ర‌ఖ్యాత మోడ‌ల్ మిరందా కేర్ త‌న సౌంద‌ర్య ర‌హ‌స్యాల‌ను వివ‌రిస్తోంది. వేడినీళ్ల‌లో గ్రీన్ టీ ఆకుల‌ను వేసి స్నానం చేస్తే శ‌రీరం కొత్త అందాల‌తో మిల‌మిల‌లాడుతుంద‌ని ఆమె భ‌రోసా ఇస్తోంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నందున గ్రీన్ టీ చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. చ‌ర్మంపై మంట‌గా ఉన్నా, ముడ‌త‌లు ప‌డుతున్న‌ట్టు అనిపించినా దీని ఆకుల‌ను ముద్ద‌గా చేసి శ‌రీరానికి రాసుకుంటే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. శీతాకాలంలో చ‌ర్మం పొడి బార‌డం అనే స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది. శ‌రీరం మృదుత్వాన్ని పొంది సువాస‌నాభ‌రితంగా ఉంటుంది.

గ్రీన్ టీ మిశ్ర‌మాన్ని మ‌నం ఇంట్లోనే సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వెడ‌ల్పాంటి పాత్ర‌లో నాలుగు క‌ప్పుల నీటిని బాగా మ‌ర‌గించి అందులో గుప్పెడు గ్రీన్‌టీ ఆకుల‌ను లేదా మూడు చిన్న ప్యాకెట్ల గ్రీన్ టీ పొడిని గానీ వేసి బాగా క‌ల‌పాలి. పావు గంట త‌ర్వాత నీటిని తీసివేసి ముద్ద‌లా చేసుకోవాలి. శ‌రీరాన్ని నీటితో తుడుచుకున్న త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి ప‌ట్టించి, పావు గంట త‌ర్వాత చ‌న్నీళ్ల‌తో స్నానం చేయాలి. ఇదే మిశ్ర‌మంలో మెత్త‌టి పంచ‌దార‌, కాస్త కోల్డ్ క్రీమ్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవ‌చ్చు. రెండు క‌ప్పుల నీటిని బాగా మ‌ర‌గ‌బెట్టి అందులో గ్రీన్ టీ ఆకులు లేదా పొడి వేయాలి. చ‌ల్లారాక ఆ నీటిలో కాస్త నిమ్మ‌ర‌సం, తేనె, విట‌మిన్‌- ఇ ఆయిల్‌, బేకింగ్ సోడా వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని గాజుసీసాలో వేసుకుని రెండ్రోజుల‌కోసారి వాడొచ్చు. దీని ముఖం, మెడ‌, చేతులు, కాళ్ల‌కు రాసుకుంటే మంచి మాయిశ్చ‌రైజ‌ర్‌లా ప‌నిచేస్తుంది.

Green tea benefits: గ్రీన్ టీ వ‌ల్ల ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా? | గ్రీన్ టీ ప్ర‌యోజ‌నాలు!

Green tea benefits: టీ, కాఫీలు విరామం లేకుండా తాగేస్తున్నారా? అయితే అనారోగ్యం త‌ప్ప‌దు. అనారోగ్యం క‌లిగించే అల‌వాటునే ఆరోగ్య‌క‌రంగా మార్చుకునే అవ‌కాశం మీ చేతుల్లోనే ఉంది. Read more

health benefits of eating watermelon

health benefits of eating watermelon: Watermelons are very good for health during the summer. It works as a medicine for Read more

holi skin care tips: హోలీ సంబురాల త‌ర్వాత చ‌ర్మంపై రంగుపోవాలంటే ఇలా చేయండి?

holi skin care tips | దేశ‌వ్యాప్తంగా హోలీ సంబురాలు ఆకాశానంటాయి. భార‌త దేశంలో కోవిడ్ ప్ర‌భావం త‌గ్గ‌డంతో ప్ర‌జ‌లు హోలీ పండుగ‌ను చాలా సంతోషంగా జ‌రుపుకున్నారు. Read more

Neem beauty benefits: సౌంద‌ర్య సుగుణాల వేప‌తో అందం మీ సొంతం!

Neem beauty benefits | వేప ఆరోగ్యానికే కాదు..అందాన్నీ ద్విగుణీకృతం చేస్తుంది. కాల‌మేదైనా దీన్ని సౌంద‌ర్య సాధ‌నంగా ఉప‌యోగిస్తే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు దూర‌మై మేని మెరుపులు Read more

Leave a Comment

Your email address will not be published.