Green tea benefits: గ్రీన్ టీ వ‌ల్ల ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా? | గ్రీన్ టీ ప్ర‌యోజ‌నాలు!

Green tea benefits: టీ, కాఫీలు విరామం లేకుండా తాగేస్తున్నారా? అయితే అనారోగ్యం త‌ప్ప‌దు. అనారోగ్యం క‌లిగించే అల‌వాటునే ఆరోగ్య‌క‌రంగా మార్చుకునే అవ‌కాశం మీ చేతుల్లోనే ఉంది. కొంచెం మీ రుచిని మార్చు కోవాల‌ని ఆలోచించండి చాలు. మీ ఆలోచ‌నే మీకు మ‌హా భాగ్యం. కాఫీ, టీల‌కు బ‌దులుగా గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ బ‌రువును త‌గ్గిస్తుంద‌ని మాత్ర‌మే చాలా మందికి తెలుసు.

కానీ గ్రీన్ టీలో కాఫీ, టీల‌తో పోలిస్తే త‌క్కువ మోతాదులో కెఫిన్ ఉండ‌టంతో పాటు మ‌న శ‌రీరానికి బ‌హుల ప్ర‌యోజ‌నాలు క‌లిగించే (Green tea benefits)ల‌క్ష‌ణాలు ఉన్నాయి. రోజూ రెండు మూడు క‌ప్పుల గ్రీన్‌టీ తాగ‌డం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఒక్క గ్రీన్ టీలో మాత్ర‌మే ఉండే ఇసిజిసి అనే రసాయ‌నంతో పాటు ఇందులో ఉండే క్షార‌గుణాలు అమినో యాసిడ్స్‌, థ‌యామిన్ లాంటివి మాన‌సిక ఒత్తిడిని, హైబీవీని త‌గ్గిస్తాయి.

జీర్ణ వ్య‌వ‌స్థ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది. ఊపిరితిత్తులు ప‌ని మెరుగువ్వ‌డంతో శ్వాస సంబంధ స‌మ‌స్య‌లు ధ‌రిచేర‌వు. రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డం వ‌ల్ల అనేక ర‌కాల రోగాల నుంచి శ‌రీరానికి ర‌క్ష‌ణ క‌లుగుతుంది. ర‌క్తంలోని షుగ‌ర్‌ను గ్రీన్ టీ నియంత్ర‌ణ‌లో ఉంచ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళ్లాల్లో కొవ్వుపేరుకోదు. పేరుకున్న కొవ్వు క‌రిగిపోతుంది.

దీని ద్వారా గుండెకు సంబంధిచిన వ్యాధుల భారిన ప‌డ‌కుండా కాపాడుకోవ‌చ్చు. మెద‌డులోని ర‌క్త‌నాళాలలో కొవ్వు క‌ర‌గ‌డంతో పాటు, జ్ఞాప‌క‌శ‌క్తిని ప్రేరేపించే ప్రాంతంపై గ్రీన్‌టీ లో ఉండే ర‌సాయ‌నాలు ప‌నిచేస్తాయి. దీని వ‌ల్ల వ‌య‌స్సు మీరిన వారిలో సాధార‌ణంగా క‌నిపించే జ్ఞాప‌క‌శ‌క్తిని కోల్పోయే వ్యాధి అల్జీమ‌ర్స్ భారిన ప‌డ‌కుండా కాపాడుకోవ‌చ్చు. గ్రీన్ టీలో ఉండే ర‌సాయాల‌ను జీవ‌కణాల సామ‌ర్థ్యాన్ని పెంచ‌డంతో పాటు, ఇందులో యాంటీ ఆక్సిండెంట్లు క్యాన్స‌ర్ క‌ణాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్‌కు గ్రీన్ టీ మంచి నివార‌ణిగా ప‌నిచ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

కేవ‌లం చైనాలో ఉత్తేజం ఇచ్చే పానియంగా వంద‌ల ఏళ్ల క్రితం క‌నుగొన‌బ‌డిన గ్రీన్‌టీలో మ‌న శ‌రీరానికి మేలు చేసే ఇన్ని మంచి ల‌క్ష‌ణాలు ఉండ‌టం నిజంగా ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

Share link

Leave a Comment