Green Peas: పచ్చి బఠాణీల రుచే వేరు. వెజ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, గ్రేవీలు చేసినప్పుడు అవి తప్పక ఉండి తీరాల్సిందే. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు బఠాణీ (Green Peas) ల సొంతం. వీటిలో న్యూట్రియంట్లు, విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా లభిస్తాయి. బీన్స్‌తో పోలిస్తే కెలోరీలు చాలా స్వల్పం. వందగ్రాముల బఠాణీల్లో కేవలం 81 కెలొరీలు ఉంటాయి. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు.
పచ్చి బఠాణీల వల్ల ఉపయోగాలు!
బరువు తగ్గాలనుకునే వారు వీటిని తరుచూ తింటే మంచిది. ఫోలిక్ యాసిడ్, బీ కాంప్లెక్స్ విటమిన్లు అధికం గా ఉంటే వీటిని గర్భిణులూ, బాలింతలు తింటే మంచిది. వీటిల్లో లభించే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. Infectionsతో పోరాడుతుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపు తుంది. బఠాణీల్లో లభించే విటమిన్ కె గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టడానికి దోహదం చేస్తుంది. ఎముకల సాంద్రతను పెంచుతుంది. మతిమరుపు సమస్యను దూరం చేస్తుంది. వీటిలో లభించే ఫ్లవనాయిడ్లూ, విటమిన్ ఎ కంటికి మేలు చేస్తాయి. దృష్టి లోపాలు రాకుండా కాపాడతాయి.


బఠాణీ (Green Peas) లు ఊపిరితిత్తుల పనితీరును మెరుపరుస్తాయి. అందుకే వీటిని తరుచూ ఆహారంలో తీసుకోవడం మంచిది అని సూచిస్తున్నారు. నిపుణులు, చిన్నారులు వీటిని తినడానికి ఇష్టపడకపోతే, వాటితో రకరకాల చిరుతిళ్లు చేసి తినిపించొచ్చు. పచ్చి బఠాణీలు ఎక్కువుగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు అనేక రకాల వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.


బఠాణీలను ఉడికించి సూప్ లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవడం ఉత్తమం. ఇంకా మటన్, చికెన్, ఉడికించిన గుడ్లతో తయారు చేసే వంటకాల్లోనూ కలపొచ్చు. పిల్లలు పచ్చి బఠాణీ(Green Peas) కాంబినేషన్‌లో తయారయ్యే వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే లేత ఆకుపచ్చని రంగులో వంటకానికే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. పచ్చి బఠాణీల్లో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలున్నాయి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు పుష్కలం. మహిళలకు, చిన్నారులకు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవసరం. పచ్చి బఠాణీల్లో అధికంగా ఉంది. వీటిని తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.