grama volunteer suicide గుంటూరు: సచివాలయం అడ్మిన్ వేధింపులకు తాళలేక వాలంటీర్ కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా మహానాడులో చోటు చేసుకుంది. మహానాడు సచివాలయం లో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట రవి కుమార్ (21) తనను సచివాలయం సిబ్బంది ఒత్తిడికి గురిచేస్తున్నారని, తన చావుకు కారణం వారేనని ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నాడు. రెండురోజుల కిందట తాడేపల్లి పోలీసు స్టేషన్లో వెంకట రవి కుమార్ కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో వెంకట రవి కుమార్ విగత జీవిగా (grama volunteer suicide) కనిపించాడు.
మృతుడి కుంటుంబాన్ని ఆదుకుంటాం


గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మహానాడు లో చనిపోయిన వాలంటీర్ కుటుంబాన్ని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని మృతుడి కుంటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కమిషనర్ తెలిపారు. వెంకట రవికుమార్ మృతిపై కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నా సచివాలయ ఉన్నత అధికారులపై విచారణకు కమిషనర్ ఆదేశించామన్నారు. డిప్యూటీ కమిషనర్ రవిచంద్రారెడ్డిని విచారణ అధికారిగా నియమించామని నిరంజన్ రెడ్డి తెలిపారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?