Grama Volunteer G.O: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు మేలు చేస్తుందనే చెప్పవచ్చు. వాలంటీర వ్యవస్థ కూడా ప్రభుత్వానికి మంచి పేరునే ఇప్పటి వరకూ తీసుకొచ్చిందని కూడా చెప్పవచ్చు. పట్టణాల్లో 100 గృహాలకు, పల్లెటూర్లలో 50 గృహాలకు ఒక్కొక్క వాలంటీర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వాలంటీర్ ద్వారా ఏపీ ప్రభుత్వ పథకాలు నేరుగా ఆయా కుటుంబాలకు చేరవేయడం, అవగాహన కల్పించడంతో పాటు రేషన్, పెన్షన్, వ్యాక్సిన్ తదితర కార్యక్రమాలను(Grama Volunteer G.O) నిర్వహిస్తున్నారు.
వాలంటీర్‌కు వచ్చే జీతంతో వాస్తవానికి వారి కుటుంబం కూడా పోషించుకోవడం కష్టమైన పనే. కానీ సీఎం జగన్ పిలుపు మేరకు పార్టీపైన అభిమానం మేరకు ఒక నిజమైన కార్యకర్త లాగా నిలువు కాళ్లపై ప్రతిరోజూ విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. నెలలో ఫస్ట్ తారీకు వచ్చిందంటే చాలు పెన్షన్ల ఇచ్చేందుకు తెల్లతెల్లవారంగానే బయలుదేరి వెళుతుంటారు. వాలంటీర్లు చేస్తున్న సేవలు ప్రభుత్వంలో 30 వేలు జీతం తీసుకునే ఉద్యోగి కూడా చేయడం లేదనే చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవో ఏమిటంటే ఎవరైనా వాలంటీరు తమ పరిధిలో ఉన్న స్థానంలో విధులకు హాజరు కాకుండా వరుసగా మూడు రోజులు సెలవు తీసుకుంటే మాత్రం వారిని తొలగించి 7వ రోజు మరొకర్ని వాలంటీర్‌గా తీసుకోవడం జరుగుతుందని జీవో సర్కిలర్ విడుదల చేశారు. ఇప్పటి వరకు వాలంటీర్లు ఒకరు, ఇద్దరు మినహా మిగిలి వారందరూ చాలా అద్భు తంగా పనిచేస్తూ ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకుపైగా వాలంటీర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇలాంటి వాలంటీర్లు తమ జీతాలు పెంచాలని కూడా అప్పుడప్పుడు ప్రభుత్వానికి తమ గోడును చెప్పుకున్నారు.
ప్రస్తుతం వచ్చిన జీవో వల్ల వాలంటీర్లు చాలా జాగ్రత్తగా విధులు చేస్తారా? ఇప్పటికే జాగ్రత్తగా అభిమానంతో, ఆత్మగౌరవంతో విధులు నిర్వహిస్తుంటే ఇలా సెలవు పేరుతో తొలగిస్తే ఎలా? అని ప్రశ్నిస్తారా లేదా అనేది వారిపై ఉన్న నమ్మకంపైన ఆధారపడి ఉంది. కాస్తో కూస్తో నెలకు వస్తున్న వేతనంతో గౌరవంగా బ్రతుకుతున్న వాలంటీర్లు అనుకోకుండా అనారోగ్యానికి గురై మూడు రోజులు సెలవు పెడితే వారిని తొలగిస్తే ఎలా అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఏదేమైనా సజావుగా సాగే వాలంటీర్ల విధులపై కఠిన నిబంధనలు విధిస్తే ప్రభుత్వంకు నష్టమే అంటున్నారు పలువురు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!