Government Order(G.O)

Government Order(G.O): సీఎస్‌కు తెలియ‌కుండానే ఆయ‌న పేరిట జీవో? | ఏపీ ప్ర‌భుత్వంలో అధికారుల అస‌హ‌నం!

Spread the love

Government Order(G.O): ఏపీ ప్ర‌భుత్వంలో కొన్ని విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. వీటిపై ఉన్న‌తాధి కారులు గుర్రుగా ఉన్నారు. ఒక‌రి శాఖ‌ల‌ను మ‌రొక‌రు బ‌దిలీ చేయ‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.


Government Order(G.O): ప్ర‌భుత్వానికి ఎవ‌రైనా అధికారిపై కోప‌మొస్తే ఆ శాఖ నుంచి ఇంకో శాఖ‌కు బ‌దిలీ చేస్తారు. కానీ రాష్ట్ర ప్ర‌భుత్వంలో ఓ పెద్ద చిత్రం చోటు చేసుకుంది. ఒక సీనియ‌ర్ అధికారిపై కోపంతో సీఎంఓకు చెందిన అధికారి ఏకంగా ఆ సీనియ‌ర్ అధికారి చూస్తున్న శాఖ‌ల‌నే మ‌రో శాఖ‌కు బ‌దిలీ చేశారు. సీఎస్ కు తెలియ‌కుండా, ఆయన పేరిటే ఉత్త‌ర్వులు వెలువ‌డ‌టం మ‌రో వింత‌. రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌లేద‌ని ఐఏఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. స‌చివాల‌య స్థాయిలో రెవెన్యూ శాఖ‌ను ప‌ర్య‌వేక్షించే అధికారి నుంచి ఇటీవ‌ల వాణిజ్య‌, రిజిస్ట్రేష‌న్ శాఖ‌లు తొల‌గించారు.

వాటిని ఆర్థిక శాఖ ప‌రిధిలోకి తెస్తూ సీఎస్ పేరుతో సీఎంఓ అధికారి జీవో జారీ చేశారు. ఇవి రెండూ ఆదాయార్జ‌న విభాగాలు కాబ‌ట్టి ఆర్థిక శాఖ ప‌రిధిలోకి తెస్తున్నాయ‌ని స‌మ‌ర్థించుకున్నారు. అస‌లు విష‌యం ఏమిటంటే, అప్ప‌టిదాకా ఆ రెండు శాఖ‌ల‌ను చూస్తున్న అధికారి అంటే గిట్ట‌నందునే, సీఎంఓ అధికారి ఈ ఎత్తుగ‌డ వేసిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. ఇలా ఒక్క జీవోతో ఉన్న ప‌ళంగా శాఖ‌లు తీసేయ‌డం అధికారుల‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కాగా ప్ర‌భుత్వ ప‌రంగా శాఖ‌ల బదిలీ ప్ర‌తిపాద‌న ఉంటే స‌రైన విధానంలో ముందుగా చ‌ర్చించి, నిర్ణ‌యం తీసుకోవాలి. కాని ఎలాంటి చ‌ర్చ లేకుండా, సీఎస్ కు తెలియ‌కుండా తోచిన నిర్ణ‌యాలు తీసుకుని జీవోలు ఇవ్వ‌డంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

వాణిజ్య ప‌న్నుల‌ను ఆర్థిక‌శాఖ ప‌రిధిలోకి తేవ‌డంలో కొంత‌లో కొంతైనా హేతుబ‌ద్ధ‌త ఉంద‌ని, రిజిస్ట్రేష‌న్ల‌ను కూడా ఆదాయ‌గ‌ర్జ‌న‌లో భాగం చేయ‌డ‌మేమిట‌ని సీనియ‌న్ అధికారులు విస్తుపోతున్నారు. భూములు రెవెన్యూ శాఖ‌లో భాగం, రిజిస్ట్రేష‌న్లు శాఖ భూములు, స్థిరాస్తుల‌కు సంబందించిన‌ది. దీనిని గుర్తించ‌కుండా రిజిస్ట్రేష‌న్ల శాఖ‌నూ ఆర్థిక‌శాఖ ప‌రిధిలోకి తేవ‌డం విస్తుగొలుపుతోంది. ఈ జీవో అదికారులు, ఉద్యోగుల‌తో పాటు మంత్రుల్లో తీవ్ర గంద‌ర‌గోళం సృష్టించింది. ఎందుకంటే ఆ శాఖ‌లు చూస్తున్న అధికారులు ఏ మంత్రుల‌కు జ‌వాబుదారీగా ఉండాల‌నేది చిక్కు ప్ర‌శ్న‌గా ఉంది.

సాధార‌ణంగా ఆర్థిక‌, వాణిజ్య ప‌న్నులు శాఖ‌కు ఒకే మంత్రి ఉంటారు. కార్య‌ద‌ర్శులు మాత్రం వేర్వేరుగా ఉంటారు. అదే విధంగా రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్ల శాఖ‌కు క‌లిపి ఒకే మంత్రి ఉంటారు. సెక్ర‌ట‌రీలు మాత్రం వేర్వేరు. ఇప్పుడు రిజిస్ట్రేష‌న్లు, వాణిజ్య ప‌న్నుల‌ను తెచ్చి ఆర్థిక శాఖ‌లో క‌ల‌ప‌డం వ‌ల్ల ఏ శాఖ సెక్ర‌ట‌రీ ఏ మంత్రికి జ‌వాబుదారీగా ఉండాల‌నే గంద‌ర‌గోళం ఏర్పండింది. ఒక్క అధికారిపై కోప‌మొస్తే పాల‌నాప‌రంగా ఇంత గంద‌ర‌గోళం సృష్టిస్తారా? అంటూ అధికారులు, ఉద్యోగులు మండిప‌డుతున్నారు.

CBI Court: ర‌ఘురామ‌కృష్ణ‌కు ఝ‌ల‌క్‌.. జ‌గ‌న్‌కు బిగ్ రిలీఫ్‌!

CBI Court హైద‌రాబాద్: అక్ర‌మ ఆస్తుల కేసులో ఏ1, ఏ2గా ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి కండీష‌న‌ల్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ర‌ఘురామ‌కృష్ణం రాజు వేసిన Read more

Political Story: ఆ పార్టీ ఎందుకు నిల‌దొక్కుకోలేక పోతుంది?

నాడు ఎన్‌టిఆర్ - నేడు జ‌గ‌న్ వ‌ల్లేనా?తెలుగు నాట చెరిపినా చెర‌గ‌ని చ‌రిత్ర ఆ పార్టీ సొంతం! Political Story: ఒక్క‌ప్పుడు ఆ పార్టీ దేశానికి దిశా, Read more

Best Chief Minister in India 2021 | Naveen Patnaik | Aravind Kejriwal | YS Jagan:బెస్ట్ సీఎంగా న‌వీన్ ప‌ట్నాయ‌క్, కేజ్రీవాల్‌, సీఎం జ‌గ‌న్‌

Best Chief Minister in India 2021 | Naveen Patnaik | Aravind Kejriwal | YS Jagan:బెస్ట్ సీఎంగా న‌వీన్ ప‌ట్నాయ‌క్, కేజ్రీవాల్‌, సీఎం Read more

AP GOVT: Aadhar Card Correction Centers in Village|ఇక ప‌ల్లెల్లో శాశ్వ‌త ఆధార్ కేంద్రాలు

AP GOVT: Aadhar Card Correction Centers in Village|ఇక ప‌ల్లెల్లో శాశ్వ‌త ఆధార్ కేంద్రాలు vijayawada: దేశంలో ప్ర‌తి ఒక్క‌రికీ ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రి అయ్యింది. Read more

Leave a Comment

Your email address will not be published.