lockdown

lockdown : తెలంగాణ లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఇవే!

Telangana
Share link

lockdown : తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మంగ‌ళ‌వారం జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశంలో 10 రోజుల పాటు లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా లాక్‌డౌన్ గైడ్‌లైన్స్‌ను విడుద‌ల చేసింది.


lockdown : తెలంగాణ రాష్ట్రంలో రేప‌టి (బుధ‌వారం) నుంచి వ‌రుస‌గా 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వ‌లు జారీ చేసింది. ఈ లాక్‌డౌన్ నిబంధ‌న‌ల్లో భాగంగా టిఎస్ క్యాబినెట్ కొన్ని నిబంధ‌న‌లు విడుల చేసింది. మే 12 నుంచి బుధవారం ఉద‌యం 10 గంట‌ల నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ ఉంటుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ప్ర‌తి రోజూ ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల అవ‌స‌రాల కోసం స‌డ‌లింపు ఉంటుంద‌ని పేర్కొంది. కేవ‌లం 4 గంట‌ల పాటు మాత్ర‌మే అన్ని ర‌కాల షాపులు తెరిచి ఉంటాయి. మిగ‌తా 20 గంట‌ల పాటు లాక్‌డౌన్(lockdown) క‌ఠినంగా అమ‌ల్లో ఉంటుంది.

మిన‌హాయింపు క‌ల్పించిన రంగాలివే!

 • వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తికి సంబందించిన ప‌నులు, అనుబంధ రంగాలు, వ్య‌వ‌సాయ యంత్రాల ప‌నులు, రైసు మిల్లుల నిర్వ‌హ‌ణ‌, సంబంధిత ర‌వాణా, ఎఫ్‌సిఐకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజ‌ర్, సీడ్ షాపులు, విత్త‌న త‌యారీ క‌ర్మాగార‌లు త‌దిత‌ర అన్నిర‌కాల వ్య‌వ‌సాయ రంగాల‌కు లాక్‌డౌన్ వ‌ర్తించ‌దు.
 • తెలంగాణ రాష్ట్ర రైతుల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోళ్ల‌ను య‌థావిధిగా కొన‌సాగించాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది.
 • వైద్య రంగంలో ఫార్మాసూటిక‌ల్ కంపెనీలు, వైద్య ప‌రిక‌రాలు త‌యారీ కంపెనీలు, మెడిక‌ల్ డిస్ట్రిబ్యూట‌ర్లు, మెడిక‌ల్ షాపులు, అన్ని ర‌కాల వైద్య సేవ‌లు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ద‌వాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్ర‌త్యేక పాసులిచ్చి, వాహ‌నాల‌కు అనుమ‌తిస్తారు.
 • గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో తాగునీటి స‌ర‌ఫ‌రా, పారిశుధ్య నిర్వ‌హ‌ణ య‌థావిధిగా సాగుతుంది.
 • విద్యుత్ ఉత్ప‌త్తి, పంపిణీ వ్వవ‌స్థ‌లు, వాటి అనుబంధ కార్య‌క‌లాపాలు య‌థావిధిగా ప‌నిచేస్తాయి.
 • జాతీయ ర‌హ‌దారుల మీద ర‌వాణా య‌థావిధిగా కొన‌సాగుతుంది.
 • జాతీయ ర‌హ‌దారుల‌పై పెట్రోల్‌, డీజిల్ పంపులు నిరంత‌రం తెరిచే ఉంటాయి.
 • కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్య‌క‌లాపాల‌కు మిన‌హాయింపు ఉంటుంది.
 • ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియాకు మిన‌హాయింపు.
 • ఉపాధి హామీ ప‌నులు య‌థావిధిగా కొన‌సాగుతాయి.
 • ప్ర‌భుత్వ కార్యాల‌యాలు 33 శాతం సిబ్బందితో ప‌నిచేస్తాయి.
 • గ‌త లాక్‌డౌన్ స‌మ‌యంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు య‌థావిధిగా ప‌నిచేస్తాయి.
 • అన్ని ముంద‌స్తు అనుమ‌తుల‌తో జ‌రిపే పెళ్లిళ్ల‌కు గ‌రిష్టంగా 40 మందికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది.
 • అంత్య‌క్రియ‌ల సంద‌ర్భంలో గ‌రిష్టంగా 20 మందికి మాత్ర‌మే అనుమ‌తి.
 • ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు రేష‌న్ షాపులు తెరిచే ఉంటాయి.
 • కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేష‌న్ స‌ర‌ఫ‌రా య‌థావిధిగా కొన‌సాగుతుంది.
See also  saidabad rape case: దుండగుడిని కఠినంగా శిక్షించాలి:డివైఎఫ్ఐ

ఇవి మూత ప‌డ‌నున్నాయి!

సినిమా హాళ్లు, క్ల‌బ్బులు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసివేయాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది. పైన తెలిపిన మిన‌హాయింపుల‌ను పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధ‌ల‌ను అనుస‌రించి క‌ఠినంగా పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది.

lockdown : క్యాబినెట్ తీసుకున్న నిర్ణ‌యాలు

ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన రాష్ట్ర క్యాబినెట్ క‌రోనా క‌ట్ట‌డి, లాక్‌డౌన్ విధింపు త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి కొన్నినిర్ణ‌యాలు తీసుకుంది. మే 20 త‌ర్వాత క్యాబినెట్ తిరిగి స‌మావేశం అవుతుంది. లాక్‌డౌన్ కొన‌సాగించే విష‌యంపై స‌మీక్షించి, త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటుంది.

 • యుద్ధ ప్రాతిప‌దిక‌న వ్యాక్సిన్ ప్రొక్యూర్ మెంట్ కోసం గ్లోబ‌ల్ టెంట‌ర్లు పిల‌వాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది.
 • ప్ర‌భుత్వ రంగంతో పాటు, ప్రైవేటు రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్లు, ఆక్సిజ‌న్‌, ఇత‌ర క‌రోనా మందుల‌ను అందుబాటులోకి తేవాల‌ని, వీటి కొర‌త రాకుండా చూడాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ను క్యాబినెట్ ఆదేశించింది.
 • అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్య‌క్ష‌త‌న క‌లెక్ట‌ర్‌, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని ద‌వాఖానా సూప‌రింటెండెంట్‌, డ్ర‌గ్ ఇన్ స్పెక్ట‌ర్ల‌తో క‌మిటీ వేయాల‌ని నిర్ణ‌యం. ప్ర‌తి రోజూ ఆయా జిల్లాల మంత్రుల వారి వారి జిల్లా కేంద్రాల్లో క‌రోనాపై స‌మీక్ష చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశం.
 • రెమిడిసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ ఉత్ప‌త్తి దారుల‌తో క్యాబినెట్ స‌మావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రానికి త‌గిన‌న్ని మందుల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు.
 • ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లు వేగ‌వంతంగా స‌మ‌కూర్చి, స‌ర‌ఫ‌రా చేయ‌డం కోసం మంత్రి కేటీఆర్ అధ్య‌క్ష‌న రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ నియ‌మాకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌, జీఏడీ ప్రిన్సిపాల్ సెక్ర‌ట‌రీ వికాస్ రాజ్‌, పంచాయ‌తీ రాజ్ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుంచి సీఎం కార్య‌ద‌ర్శి, కోవిడ్ ప్ర‌త్యేకాధికారి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్‌లో స‌భ్యులుగా ఉంటారు.

Leave a Reply

Your email address will not be published.