- రేపటి నుంచి కఠిన లాక్డౌన్
Karnataka Lockdown : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. రేపటి(మంగళవారం) నుంచి లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలయ్యేలా ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఇవ్వనుంది. లాక్డౌన్ సుమారు 2 వారాల పాటు అమలు చేయనుంది.
Karnataka Lockdown : దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మరో సారి భారత్ కఠిన ఆంక్షల వలయంలోకి జారుకోబోతుంది. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు కఠిన లాక్డౌన్ అమలు పరుస్తుండగా తాజాగా కర్ణాటక ప్రభుత్వం 14 రోజుల కఠిన కర్ఫ్యూ ప్రకటించింది. ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ , బెంగళూరులో వీకెండ్ లాక్డౌన్(weekend lockdown) విధించినప్పటికీ వైరస్ కట్టడి కాకపోవ డంతో మంగళవారం రాత్రి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయను న్నట్టు సీఎం యడ్యూరప్ప(CM Yediyurappa) వెల్లడించారు. సోమవారం కేబినెట్ సమావేశం అనంతరం సీఎం యడ్యూరప్ప మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ విజృంభిస్తోందన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని వెల్లడించారు. 45 ఏళ్లు పైబడిన అందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే టీకా వేయిస్తోందన్నారు.
ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ(Nighr Curfew)తో ప్రయోజనం లేదని భావించి లాక్డౌన్( lockdown) విధించేశాయి. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల ప్రక్కన కర్ణాటక చేరింది. కర్ణాటక లో గత 24 గంటల్లో అత్యధికంగా 34 వేల కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగళూరు నగరంలోని 20 వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. కేబినెట్ నిర్ణయం అనంతరం రాష్ట్రంలో మంగళవారం నుంచి 2 వారాల పాటు సంపూర్ణ లాక్డౌన్ ఉంటుంది. నిత్యవాసర వస్తువులకు మాత్రం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ మినహాయింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎం యడ్యూరప్ప మాట్లాడుతూ.. ఢిల్లీ, మహారాష్ట్రాల కంటే తమ రాష్ట్రంలో పరిస్థితి భయంకరంగా ఉందని తెలిపారు. అందుకే రానున్న రెండు వారాల పాటు కఠిన ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ సెక్టార్ సంబంధిత వ్యాపారాలకు మాత్రమే ఓపెన్ చేసి ఉంచడానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. మద్యం కావాలనుకునే వారికి హోం డెలివరీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ప్రజా సేవలను నిలిపివేస్తన్నామని వివరించింది. రాష్ట్రంలో షెడ్యూల్ చేసిన ఎన్నికలను కనీసం మూడు నెలల వరకు నిలిపివేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్(State election commission)కు యడ్యూరప్ప కేబినెట్ కు లేఖ రాసింది.


కర్ణాటకలో సెకండ్ వేవ్(second wave) పంజా విసురుతోంది. ప్రతి రోజూ కరోనా కేసులు భారీగా నమోదువు తున్నాయి. దీంతో పరిస్థితి మరీ ఘోరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 10 మంది కరోనా బారిన పడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత 25 రోజులుగా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. రాజధాని బెంగళూరు నగరంలోని ప్రతి నిమిషానికి 7 పాజిటివ్ కేసులు నమోదవు తున్నాయి. ప్రతి గంటకూ కరోనా మరణాలు రెండు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక కర్ణాటక ప్రభుత్వం పూర్తిగా లాక్డౌన్ ప్రకటించింది.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court