Jamili Elections in Telugu News : NewDelhi:జమిలి ఎన్నికలపై కేంద్రం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ విధానం అమలుపై ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అన్న మాటలు త్వరలో నెరనున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు జమిలిని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను ఆకర్షించుకునేందుకు కేంద్ర పథకానలు విరివిగా వినియోగించుకుంటూ ప్రచారం ప్రారంభించాయి. జమిలి ఎన్నికలపై దేశంలో వామపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేఖత వస్తున్నప్పటికీ ఇతర పార్టీలు మాత్రం అంతగా వ్యతిరేకించడం లేదు. 2020లో నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో దేశంలోని 22 పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించాయి. అప్పటి నుంచి ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న కేంద్రం ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలు వేగంగా కార్యాచరణకు సిద్ధమవుతుంది భారత్ ప్రభుత్వం. తాజాగా రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్‌ను లా కమిషన్ రూపొందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
2022 చివరి కల్లా!
కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనతో రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. లోక్‌సభలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, వంగా గీత, మన్నె శ్రీనివాస్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి రూట్ మ్యాప్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సిబ్బంది, ప్రజా సమస్యలు, న్యాయ శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయి సంఘం తోనూ చర్చించి తన 79వ నివేదికలో కొన్ని సిఫార్సులు చేసిందని ఆయన తెలిపారు. వీటిని లా కమిషన్ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వాలు జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధమేనని ప్రకటించాయి. ఈ పరిణామాలన్నీంటిపైనా వచ్చే ఏడాది 2022 చివరి కల్లా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
గతంలో జరిగిన జమిలి ఎన్నికలు
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ఈనాటిది కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలను మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతరం కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాలు శాసనసభలను బర్తరఫ్ చేయడం వల్ల జమిలి ఎన్నికలు ప్రక్రియ గాడి తప్పింది. ప్రస్తుతం లోక్‌సబ, అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతున్నాయి. 1983లోనే నాటి ఎన్నికల సంఘం చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని ప్రతిపాదించింది. 1999లో లా కమిషన్ ఇదే సూచన చేసింది.
రెండేళ్ల కిందట జమిలి ఎన్నికలపై అఖిలపక్షం సమావేశాన్ని నిర్వహించగా, సమాజ్‌వాద్ పార్టీ, అన్నాడీఎంకే తదితర పార్టీలు మద్దతు తెలిపాయి. బీఎస్పీ, టిడిపి, తృణమూల్ పార్టీలు వ్యతిరేకించాయి. కాంగ్రెస్, బీజేపీ తమ వైఖరి స్పష్టంగా పేర్కొనలేదు. ఆయా పార్టీల అభిప్రాయాలలోనే అప్పటి, ఇప్పటికీ చాలా తేడాలు వచ్చాయి. అయితే 2015 లో పార్లమెంటరీ కమిటీ జమిలి ఎన్నికలకు ప్రతిపాదించింది. జమిలికి సిద్ధమని 2017లో నాటి సీఈసీ ఓపీ రావత్ ప్రకటించారు. 2021 సంవత్సరం నాటికి రెండు దశలుగా జమిలి ఎన్నికలు జరుపొచ్చంటూ నీతి ఆయోగ్ గతంలో ఒక నివేదికను సమర్పించింది.


పలు దేశాల్లో అమలు…
ప్రపంచంలో పలు దేశాల్లో జమిలి ఎన్నికల విధానం అమలులో ఉంది. స్వీడన్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, జర్మనీ, స్పెయిన్, హంగరీ, బెల్జియం, పోలాండ్, స్లోవేనియా, అల్బేనియా తదితర దేశాల్లో చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో ప్రతి ఐదేండ్లకూ జాతీయ అసెంబ్లీ, రాష్ట్రాల శాసనసభలు, మున్సిపల్ కౌన్సిల్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. స్వీడన్ దేశంలోనూ ఇదే తరహా విధానం అమలులో ఉంది. ఇండోనేషియాలో అధ్యక్ష, రాష్ట్ర చట్టసభల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం 2019 నుంచే ప్రారంభమైంది. జమిలి ఎన్నికల విషయంలో ఇతర దేశాల రాజకీయాలు, మన దేశ రాజకీయాల చట్టసభలలో అనేక తేడాలు ఉన్నాయి. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఎక్కువుగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఇది చదవండి: ఫాస్టాగ్ పై కేంద్రం కొత్త నిబంధనలు..ఇక జరిమానానే!
ఇది చదవండి: నాగచైతన్య ఖాతాలో మరో కొత్త లవ్‌స్టోరీ సాంగ్!
ఇది చదవండి:బాలయ్యపై అందుకే అమితమైన ప్రేమ!
ఇది చదవండి:ఇల్లందు మైన్స్‌లో ఆచార్య షూటింగ్!
ఇది చదవండి:మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీకి షాక్!
ఇది చదవండి:ఇనిమెళ్ల గ్రామంలో కొట్టుకున్న టిడిపి-వైసీపీ వర్గీయులు
ఇది చదవండి:ఎస్సైలనే బెదిరించిన కిలాడీ లేడి..చివరకు!
ఇది చదవండి:కొత్త పార్టీపై షర్మిల బిజీ! ఖమ్మం నేతలపై ఫోకస్!
ఇది చదవండి: ఆ చేప మహా డేంజర్! తగిలితే అంతే సంగతులు!