government doctors private practice | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులు ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధం విధిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ప్రాక్టీస్పైనే పలువురు ప్రభుత్వ వైద్యులు దృష్టి సారిస్తున్న విషయంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పరుస్తున్నట్టు సర్కారు తెలిపింది.వైద్యుల సేవలను మెరుగు పరిచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ఆర్థిక అవసరాల నిమిత్తమో, వారికున్న డిమాండ్ నిమిత్తమో ఎక్కువ మంది ప్రైవేటు ప్రాక్టీసు నిర్వహిస్తుండటం అందరికీ తెలిసిందే.దీనిపై ఎప్పటి నుంచో అభ్యంతరాలు ఉన్నాయి. ప్రైవేటు ప్రాక్టీసు నిర్వహిస్తున్న వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులను సరిగా నిర్వహించడం లేదని, వారి దృష్టి ప్రైవేటు ప్రాక్టీస్ ద్వారా వచ్చే డబ్బుపైనే ఉంటుందనే చర్చ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
government doctors private practice
ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు నిర్వహించకుండా నిషేధం విధిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పష్టమైన నియమ, నిబంధనలను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. నాడు-నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగు పరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించింది. నాణ్యమైన మందులను ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేస్తోంది. అయినప్పటికీ గవర్నమెంట్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటు ఆసుపత్రుల్లోనే మెరుగైన సేవలు అందిస్తున్నారనే భావనలో ప్రజలు ఉన్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!