Lockdown : తెలంగాణ‌లో మ‌రో వారం పాటు పొడిగింపు?

Lockdown : రాష్ట్రంలో క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న లాక్‌డౌన్ మ‌రికొద్ది రోజుల‌కు పొడిగించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు వైద్య‌శాఖ‌కు సీఎం కేసీఆర్ స‌మీక్షా స‌మావేశం ఏర్పాటు చేసి నిర్ణ‌యం తీసుకోనున్నారు.


Lockdown : తెలంగాణ రాష్ట్రంలో మ‌రో వారం పాటు లాక్‌డౌన్ పొడిగించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు లాక్‌డౌన్నే స‌రైన నిర్ణ‌యంగా భావించిన ప్ర‌భుత్వం పొడిగించ‌క త‌ప్ప‌ద‌ని వైద్య‌శాఖ భావిస్తోంది. వాణిజ్య‌, ఎక్సైజ్ శాఖ‌కు ప్ర‌భుత్వం సంకేతాలిచ్చిన‌ట్టు తెలియ‌వ‌చ్చింది. లాక్‌డౌన్ మ‌రియు క‌రోనా నియంత్ర‌ణ‌పై ఈ నెల 28న ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. వైద్యశాఖ సూచ‌న‌ల మేర‌కు లాక్‌డౌన్ పొడిగించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే జూన్ మొద‌టి వారం వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించాల‌ని మెజార్టీ రాష్ట్రాలు భావిస్తున్నాయి. క‌రోనా క‌ట్ట‌డి చేసేందుకు తెలంగాణ‌లో ఈ నెల(మే) 12 నుంచి లాక్‌డౌన్ నిబంధ‌న‌లు కొన‌సాగుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. లాక్‌డౌన్ స‌మ‌యంలో పాజిటివ్ కేసులు ఆశించిన మేర‌కు త‌గ్గిన‌ట్టు క‌నిపించ‌లేద‌నే భావ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. అయితే లాక్‌డౌన్ తో కేసుల సంఖ్య కొంత‌వ‌ర‌కు త‌గ్గింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నిలిచిపోతుంది. దీంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. వ్యాక్సినేష‌న్ల‌ను దిగుమ‌తి చేసుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం గ్లోబ‌ల్ టెంట‌ర్ల‌ను ఆహ్వానించింది. జూన్ మొద‌టి వారంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పెద్ద మొత్తంలో ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న‌టువంటి ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్‌ను మ‌రికొన్ని రోజుల పాటు పొడిగిస్తే త‌ప్ప క‌రోనా కేసులు త‌గ్గేట‌ట్టు లేవ‌ని ప్ర‌భుత్వం అభిప్రాయం ప‌డుతుంది.

చ‌ద‌వండి :  Nalgonda crime: road accident in Nalgonda district | న‌ల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *