Lockdown News

Lockdown News : Haryanaలో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌

Spread the love

Lockdown News : దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల‌న్నీ కొన్ని వారాల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి.


Lockdown News : హ‌ర్యానా : రాష్ట్రంలో క‌రోనా కేసులు ఉధృతి అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో సోమ‌వారం నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది ఆ రాష్ట్రం. సోమ‌వారం నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ ఉంటుంద‌ని రాష్ట్రం హోం మ‌రియు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి అనిల్ విజ్ ప్ర‌క‌టించారు. క‌రోనా సునామీలా విరుచుకుప‌డు తుండ‌టంతో ఇప్ప‌టికే 9 జిల్లాల్లో లాక్‌డౌన్ విధించిన హ‌ర్యానా స‌ర్కార్ ఇప్పుడు లాక్‌డౌన్ ను రాష్ట్ర వ్యాప్తంగా విధిస్తున్న‌ట్టు తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. హ‌ర్యానాలో శ‌నివారం నాడు అత్య‌ధికంగా 13 వేల 588 కేసులు నిర్థార‌ణ అయ్యాయి. 125 మంది క‌రోనా కాటుకు బ‌లై క‌న్ను మూశారు. ఇంకో వైపు ఆక్సిజ‌న్ నిల్వ‌లు, వ్యాక్సిన్ నిల్వ‌ల కొత‌ర నివారించేందుకు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించింది. రేప‌టి(సోమ‌వారం) నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంద‌ని,

అయితే నిత్యావ‌స‌ర స‌రుకులు, మందులు, ర‌వాణా వాహ‌నాల‌కు మినహాయింపు ఇచ్చిన‌ట్టు స్ప‌ష్టం చేసింది. దేశ రాజ‌ధాని ఢిల్లీకి ఆనుకొని ఉన్న హ‌ర్యానాలో క‌రోనా విజృంభ‌ణ మొద‌లు కావ‌డంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌లెవ్వ‌రూ అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని, లాక్‌డౌన్ ను స్వ‌చ్ఛందంగా పాటించ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాల‌ని, అలాగే సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ క‌రోనాను క‌ట్ట‌డి చేయాల‌ని హ‌ర్యానా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చింది.

ఒడిశాలో రెండు వారాలు పాటు పూర్తి Lockdown

ఒడిశాలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంబిస్తున్న‌ది. శ‌నివారం ఉద‌యం నుంచి ఆదివారం ఉద‌యం వ‌ర‌కు గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో అక్క‌డ 10 వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దాంతో క‌రోనా క‌ట్ట‌డి కోసం ఒడిశా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 5 వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు 14 రోజుల పాటు క‌ఠిన లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తెలిపారు. ప్ర‌స్తుతం దేశ‌మంత‌గా క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొన‌సాగుతున్న‌ద‌ని, ఈ నేప‌థ్యంలో చైన్‌ను బ్రేక్ చేయ‌డం కోసం లాక్‌డౌన్ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ఒడిశా సీఎం వెల్ల‌డించారు.

కాగా క‌రోనా మ‌హమ్మారి క‌ట్ట‌డి కోసం ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఢిల్లీల్లో కూడా అక్క‌డి ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌లు విధించాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రో వారం పాటు లాక్‌డౌన్ ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే లాక్‌డౌన్‌లో కొన‌సాగుతున్న ఢిల్లీ లో ప‌రిస్థితి ఏమాత్ర‌మూ మెరుగుప‌డ‌లేదు. గ‌త 24 గంట‌ల్లో 27 వేల‌కు పైగా కేసులు రాగా 375 మంది మృత్యువాత ప‌డ్డారు. మ‌రో వారం రోజులు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్టు సీఎం తెలిపారు.

big news: బెదిరించి..హ‌త్యాచారం చేసి ఆపై పురుగుల మందు తాపించి హ‌త్య‌! ఎక్క‌డంటే?

big news: హ‌ర్యానా రాష్ట్రం సోనిప‌ట్ ప‌రిధిలోని ఓ గ్రామంలో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌ల్లిని బెదిరించి, ఇద్ద‌రు మైన‌ర్ బాలిక‌ల‌పై న‌లుగురు వ్య‌క్తులు అత్యాచారానికి Read more

Ritika Phogat Suicide: రెజ్లింగ్ క్రీడాకారిణి రితికా ఫోగాట్ ఆత్మ‌హ‌త్య

Ritika Phogat Suicide : Haryana : భార‌త దేశ ప్ర‌ముఖ రెజ్ల‌ర్లు గీతా ఫోగాట్ , బ‌బితా ఫోగాట్ క‌జిన్ సిస్ట‌ర్ రితికా ఫోగాట్ ఆత్మ‌హ‌త్య Read more

Lockdown : తెలంగాణ‌లో లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ స్పంద‌న‌!

Lockdown : తెలంగాణ‌లో లాక్‌డౌన్ పై సీఎం కేసీఆర్ స్పందించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో లాక్డౌన్ పెట్టే ఆలోచ‌న లేద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా Read more

Covid Second wave : ఆరు రాష్ట్రాల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్న క‌రోనా కేసులు

Covid Second wave : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అంత‌కంత‌కూ విజృంభిస్తోంది. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టికీ కేసులు ఏ మాత్ర‌మూ త‌గ్గ‌డం లేదు. తాజా Read more

Leave a Comment

Your email address will not be published.