Goutham Reddy Death Timing హైదరాబాద్ఫ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారంపై ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబం స్పందించింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బంది పడ్డారన్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు. ఆదివారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్ లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా ఇంటికి చేరారని కుటుంబ సభ్యులు (Goutham Reddy Death Timing)చెబుతున్నారు.
సోమవారం ఉదయాన్నే 6 గంటలకు రోజూలానే మంత్రి నిద్ర లేచారని, 6.30 గంటల వరకూ ఫోన్లలో కాలక్షేపం చేశారని 7 గంటలకు మంత్రి నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో కూర్చుని ఉన్నారని తెలిపారు. సరిగ్గా 7.12 గంటలకు తనకు అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పారు. 7.15 గంటలకు హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి మెల్లగా కిందకు ఒరిగారు మంత్రి.
7.16 గంటలకు కంగారు పడిన మంత్రి సతీమణి మేకపాటి శ్రీకీర్తి గట్టిగా అరిచారు. 7.18 గంటలకు పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బంది పడుతున్న మంత్రి ఛాతిమీద చెయ్యితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించారు మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావు. 7.20 గంటలకు మంత్రి మేకపాటి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తంగా ఉన్నారు. మంచి నీరు కావాలని అడిగారు. ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో మంత్రి ఉండిపోయారు. వెంటనే భార్య శ్రీకీర్తి మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచారు.

7.22 గంటలకు నొప్పి పెడుతుంది కీర్తి అంటున్న మంత్రి మాటలకు స్పందించి వెంటనే ఆస్పత్రికి వెళదామని మంత్రితో సిబ్బంది బయలుదేరారు. 7.27 మంత్రి ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి గల 3 కి.మీ దూరాన్ని, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి మంత్రిని డ్రైవర్, సిబ్బంది చేర్చారు. సరిగ్గా 8.15 గంటలకు పల్ప్ బాగానే ఉంది. అపోలో వైద్యులు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చివరకు 9.13 గంటలకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇక లేరని అపోలో ఆస్పత్రి వైద్యులు నిర్థారించారు. 9.15 గంటలకు మంత్రి చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!