Gorantla Butchaiah Chowdary : తెలుగువాడిగా సొంత రాష్ట్రానికి వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ పట్ల ప్రభుత్వం వ్యవమరించిన తీరు హేయమని టిడిఎల్పీ ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని హితబోధ చేశారు.
Gorantla Butchaiah Chowdary : అమరావతి : అత్యున్నత ప్రోటోకాల్ ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ తొలిసారి సొంత రాష్ట్రానికి వస్తే ప్రభుత్వం ఆహ్వానం పలికిన విధానం దారుణమని టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్కు రాజకీయ కుట్రలు ఎన్నైనా ఉండొచ్చు కానీ, ఇలా వ్యవహరించడం దుర్మర్గపు చర్య అని మండిపడ్డారు. గవర్నర్, సీఎం హాజరు కావాల్సిన కార్యక్రమంలో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు, టిటిడి ఛైర్మన్, కార్యనిర్వహణాధికారితో ఆహ్వానం పలకడం ఎంత వరకు సబబని నిలదీశారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే ఉపముఖ్య మంత్రులు, మంత్రులు మొద్దు నిద్ర పోతున్నారా? అని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్, ముఖ్యమంత్రి జస్టిస్ రమణను కలిసి సాదరంగా గౌరవ మర్యాదలతో ఆహ్వానం పలకడం, యాదాద్రి దర్శనానికి పిలవడం గౌరవ మర్యాదల్లో పరిపక్వతకు నిదర్శనమని అన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాకంతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని గోరంట్ల బుచ్చ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్