Google Products failed

Google Products failed:గూగుల్ మామ చేసిన కొన్ని త‌ప్పులు గురించి మీకు తెలుసా?

Spread the love

Google Products failedనెట్ ప్ర‌పంచంలోనే గూగుల్‌దే అగ్ర‌స్ధానం. కానీ ఆ గూగుల్ కూడా కొన్నింటిలో విఫ‌ల‌మైంది. అలాంటి వాటిలో ముఖ్య‌మైన‌వి (Google Products failed)ఇవి.

గూగుల్ గ్లాస్(google glass):- అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన గూగుల్ గ్లాస్ క‌థ ముగిసింది. గూగుల్ గ్లాస్ అమ్మ‌కాల‌ను నిలిపి వేస్తున్న‌ట్టు గూగుల్ ప్ర‌క‌టించింది. వేర‌బుల్ డివైజ్‌లో కొత్త ట్రెండ్‌కు నాంది ప‌లికింద‌నుకున్న గూగుల్ గ్లాస్ అక‌స్మాత్తుగా మార్కెట్లో నుంచి మాయ‌మైంది. గూగుల్ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా మొద‌లు పెట్టి విఫ‌ల‌మైన ప్రాజెక్టుల్లో ఇది ఒక‌టి.

గూగుల్ వేవ్‌(google wave):- ఇది ఒక రియ‌ల్ టైమ్ క‌మ్యునికేష‌న్ ప్లాట్‌ఫాం. ఇందులో ఈ-మెయిల్‌, ఇన్‌స్టంట్ మెస్సేజింగ్‌, వెబ్‌చాట్, సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్‌, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌… ఇలా ప‌లు ర‌కాల ఫీచ‌ర్లు ఉండేవి. స్నేహితులు లేక వ్యాపార భాగ‌స్వాముల‌తో గ్రూప్‌గా ఏర్ప‌డి డిస్క‌స్ చేసుకోవ‌డం, ఫైల్స్ షేర్ చేసుకోవ‌డం ఇందులో సాధ్య‌మ‌య్యేది. అయితే ఈ ప్లాట్‌ఫామ్ విఫ‌లమైంది. ఇది గూగుల్ బిగెస్ట్ హై – ప్రొపైల్ ఫెయిల్యూర్‌గా నిలిచిపోయింది. ఫీచ‌ర్ల‌న్నీ బండిల్‌గా ఒకే చోట చేర్చ‌డంతో ఇబ్బందులు త‌ప్ప‌లేదు.

గూగుల్ టీవీ(google tv):- ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్‌, స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ హ‌వా కొన‌సాగింది. అదే ఊపులో బిగ్గెస్ట్ స్క్రీన్‌తో గూగుల్ టీవీని తీసుకువ‌చ్చి ప్ర‌తీ ఇంట్లోను పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నించింది. కానీ లాకాఫ్ కంటెంట్, ఫూర్ యూజ‌ర్ ఇంట‌ర్ ఫేస్‌తో స‌క్సెస్ కాలేక‌పోయింది.

గూగుల్ వీడియో(google video):- యూట్యూబ్‌ను పోటీగా ప్రారంభ‌మైన గూగుల్ వీడియో అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోలేక‌పోయింది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా యూట్యూబ్‌కు పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. చివ‌ర‌కు గూగుల్ సంస్థ యూట్యూబ్‌ను సొంతం చేసుకోవ‌డంతో గూగుల్ వీడియో పూర్తిగా క‌నుమ‌రుగైపోయింది. గూగుల్ వీడియోను ఎంపిక చేసుకున్నా యూట్యూబ్‌లోని వీడియోల‌నే ద‌ర్శిస్తారు.

గూగుల్ ఆన్స‌ర్స్‌(google answer):- మీ సందేహాల‌కు స‌మాధానం కావాల‌ని ప్ర‌శ్న‌లు సంధిస్తే ఆ ప్ర‌శ్న‌లు స‌మాధానాలు లేని వాటిలా అలా తిరుగుతూనే ఉంటాయి. యాహూ ఆన్స‌ర్స్ మాదిరిగా గూగుల్ ఆన్స‌ర్స్‌ను ప్ర‌వేశ‌పెట్టిన గూగుల్ సంస్థ విజ‌య‌వంతం కాలేక‌పోయింది.

Grammarly Check For Great Writing, Simplified

Grammarly: free essay checking tool will help you review your papers for grammatical mistakes, unclear sentences, and misused words. Save Read more

Google Trends 2021 in India

Google Trends 2021 in India | Below is the trending keyword that people in India searched for the most in Read more

What is Dynamic DNS used for?

What is Dynamic DNS | Dynamic DNS allows you to direct your domain or a subdomain to a resource that Read more

What is HTTPS Means?

What is HTTPS Means? | Hypertext Transfer Protocol (HTTP) is a set of rules browsers use to determine how to Read more

Leave a Comment

Your email address will not be published.