Good Sleep: మనిషికి శక్తినిచ్చే సాధనం నిద్ర. నిద్ర తగినంత పోకపోవడం వలనే మనకు పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. రాత్రి వేళ పడుకోగానే మంచి నిద్ర పట్టగలగటం ఒక వరం. సరిగా నిద్రపోలేని వారి జీవితం నరక ప్రాయమే అవుతుందని చెప్పవచ్చు. మనిషి జీవితం ఒక క్రమ పద్ధతి ప్రకారం నడిచేందుకు వీలుగా పరిణమించింది.
Good Sleep: రాత్రి వేళ నిద్ర అవసరం
రాత్రి, పగలు వేళలలో చేయటానికి భిన్నమైన పనులు నిర్ధేశించింది ప్రకృతి. రాత్రి వేళ నిద్రపోవాలి, పగటిపూట ఆట, పాట, ఉపాధి అంశాలను చూసుకోవాలి. శరీరం కూడా ఒక్కొక్క సమయంలో ఒక రకమైన పనికి సిద్ధంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ నిర్దేశిత సమయంలో నిర్ధేశిత పనులు చేయాలి. అదే విధంగా నిద్రకు కూడా సమయం నిర్ధేశించుకోవాలి. మనం ప్రతిరోజూ పడుకునే సమయం, మేల్కొనే సమయం ఒక క్రమ పద్ధతిగా పాటించాలి. దీని వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది.
గంటల సమయం తప్పకుండా కేటాయించుకోవాలి. 6 గంటల కన్నా తక్కువ నిద్ర పోవడమంటే శరీరాన్ని కష్టపెట్టడమే. ఆ నిద్రను ఒక క్రమపద్ధతిలో అందించకపోయినా ఇబ్బంది తప్పదు. పెద్ద వాళ్ల కన్నా పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం. వారికి 10 గంటల వరకు నిద్ర అవసరమవుతుంది. ఒక సారి నిద్ర Good Sleep, కు తప్పనిసరిగా ఆరు నుండి 8 గంటల అవసరం మేర కన్నా ఎక్కువ సమయం నిద్ర పోతున్నట్టు అనిపిస్తే ఆ నిద్రను నియంత్రించుకునేందుకు అలారం క్లాక్‌ని ఆశ్రయించవచ్చు. నిర్ధేశిత నిద్ర గంటలు గడవగానే మెలకువ తెచ్చే విధంగా అలారం పెట్టుకోవాలి.
పగటి పూట నిద్ర మంచిది కాదు
పడక గదిలో అలారం క్లాక్ Clock, లేదా వాల్‌క్లాక్ ఉండటం వల్ల ఇబ్బంది ఉంటుందంటారు చాలా మంది. ప్రతి 10 నిమిషాలకు గడియారం వైపు చూడాలనిపిస్తుంది. అలా చూడటం వల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. ఇటువంటి సందేహం మనసులో ఉంటే గడియారాన్ని ఎదురుగా కాక ధ్వని వినిపించేలా కొంచెం దూరంగా పెట్టుకోవాలి. రాత్రి వేళ నిద్ర తగినంత పొందాలంటే పగటి పూట నిద్రకు దూరంగా ఉండాల్సిందే. పగటి వేళ గంట సేపు పడుకున్నా చాలు రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకుండా పోవడానికి, పగటి పూట కొద్దిసేపు పడుకుని లేద్దామనుకుని చాలా మంది ఆ నిద్రను గంటల సేపు కొనసాగిస్తారు. ఫలితంగా నిద్రపోవాల్సిన రాత్రి సమయంలో కళ్ళు తెర్చుకొని కూర్చోవాల్సి వస్తుంది.
చక్కని సంగీతం వినండి
ఇటువంటి సమస్యలకు విరుగుడు సాయంత్రం వేళ చేసే వ్యాయాం, సాయంత్రం వేళ నడక లేదా యోగసనాలు వంటివి చేయడం వల్ల సులభంగా నిద్రపోగలుగుతారు. పడుకునే ముందు దీర్ఘంగా గాలి పీల్చి వదలడం వల్ల శరీరం తేలికపడుతుంది. నిద్రలోకి తీసుకుని వెళ్లే మార్గాలలో అది ఒకటి మాత్రమే. చక్కని సంగీతం వింటూ నిద్రలోకి జారుకోవడం చాలా సులభం. మానసిక ఆందోళన, ఒత్తిడికి గురయ్యే వారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం లేదా శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు, భారీ కాయం వంటి అంశాల వల్ల సరిగ్గా నిద్ర పట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఒత్తిడి, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్ర లేమి ఏర్పడుతుంది.
అంతే కాకుండా జీర్ణప్రక్రియ సరిగ్గా జరగకపోవడం ఒక కారణంగా చెప్ప వచ్చు. కాబట్టి రాత్రి వేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. రాత్రి వేళ తక్కువ మసాలా దినుసులు ఉండే ఆహారం తీసుకోవాలి. మితంగా భోజనం చేయాలి. కడుపులో ఇంకా కొంచెం ఖాళీగా ఉండగానే కంచం ముందు నుండి లేవటం మంచిది. భోజనం చేసిన తర్వాత కొద్ది సమయం ఉండి ఆపైన ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు తాగితే రాత్రిపూట హాయిగా నిద్రపోగలుగుతారు.
పడగ గదికి బాగుందా!
నిద్ర పోవటానికి పడగ గది Room, కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. నిద్ర Sleep, కు పడక గదిలో ఉండే ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండాలి. అధిక వేడి ఉన్నా, మరీ చల్లగా ఉన్నా నిద్రపట్టడంలో సమస్య వస్తుంది. వెలుతురు కూడా అనుకూలంగా ఉండి తీరాలి. మరీ చీకటిగా ఉండకూడదు. అలాగే కంటి మీద వెలుతురు పడే విధంగా ఉండకూడదు. గదిలో ఒక మూలన బెడ్ లాంప్ వెలుగుతుంటే బాగుంటుంది. గాలి, శబ్ధాలు కూడా నిద్రను పాడు చేస్తాయి. రోడ్లకు దగ్గరలో ఇల్లు ఉంటే రోడ్ల మీద వెళ్లే వాహనాలు ధ్వనులు రాత్రంతా వేధించి నిద్రపోనీవ్వవు. కాబట్టి గదిలో ధ్వనులు ఎక్కువగా రాకుండా మంచి వాతావరణం ఉండాలి.
నిద్రకు బెడ్‌కు అధిక ప్రాధాన్యత ఉంది. సౌకర్యంగా పడుకునే మంచం, బెడ్ ఏర్పాటు చేసుకుంటే హాయిగా నిద్రించగలుగుతారు. పడుకునే ముందుకు బెడ్ దులిపి వేసుకోవాలి. బెడ్ మీద ముడతలు లేని విధంగా బెడ్‌షీట్‌ని పరవాలి. దిండు మరీ ఎత్తుగా లేతా మరీ లోతుగా లేని విధంగా ఉండాలి. మిగిలిని అన్ని అంశాలు సక్రమంగా ఉన్నప్పటికీ నిద్రపోలేకపోతుంటే అతి ఆలోచనలు మెదడులో మెదులుతున్నాయేమో చూసుకోవాలి. కాబట్టి పైన తెలిపిన విధంగా నిద్రకు భంగం కలిగించే అన్ని ఇబ్బందులనూ సరి చేసుకుంటే మంచి నిద్ర Good Sleep, పోవడానికి ఎక్కువ అవకాశం ఉంది.