Google Pay

Google Pay : గూగుల్ పే వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌!

Spread the love

Google Pay : గూగుల్ పే యాప్ వినియోగ‌దారుల‌కు మ‌రో కొత్త ఫ్యూచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ఇండియాతో పాటు అమెరికా, సింగ‌పూర్ లో ఉన్న‌వారికి కూడా డ‌బ్బులు పంపించే అవ‌కాశం క‌ల్పించింది.


Google Pay : ఆన్‌లైన్ న‌గ‌దు(online money) లావాదేవీల రంగంలో ప్ర‌ముఖ దిగ్గ‌జం గూగుల్ పే యాప్ త‌న వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు స్వ‌దేశంలోనే డ‌బ్బులు ఒక‌రికొక‌రు సెండ్ చేసుకునే అవ‌కాశం ఉంది. అయితే ఇప్ప‌టి నుంచి అమెరికా నుంచి భార‌త్‌, సింగ్ పూర్ యూజ‌ర్ల‌కు డ‌బ్బులు పంపే వెసులుబాటును ఆ సంస్థ క‌ల్పించింది. అయితే యూజ‌ర్ల‌కు ఈ స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు ఆర్థిక సేవ‌ల సంస్థ‌లు వెస్ట్ర‌న్ యూనియ‌న్‌, వైజ్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకున్న‌ట్టు టెక్ క్రంచ్ పోర్ట‌ల్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అయితే ఈ సంద‌ర్భంగా గూగుల్ పే కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రించింది.

అంతేగాక ఆర్థిక సేవ‌ల సంస్థ‌లు వెస్ట్ర‌న్ యూనియ‌న్ తో న‌గ‌దు బ‌దిలీ ఒప్పందం కుదుర్చుకున్న నేప‌థ్యంలో ఇక‌పై అమెరికా యూజ‌ర్లు మ‌రో 200 దేశాల‌కు, వైజ్ ద్వారా 80 దేశాల‌కు డ‌బ్బు పంపుకునే సౌక‌ర్యాలు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని గూగుల్ పే చెప్పింది. ఈ స‌దుపాయాలు వ్య‌క్తిగ‌త యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయ‌ని, బిజినెస్ లావాదేవీల‌కు ఈ సౌక‌ర్యం ఉండ‌బోద‌ని టెక్ క్రంచ్ వివ‌రించింది. ఇటీవ‌ల కాలంలో న‌గ‌దు బదిలీల కోసం ఇండియాలో గూగుల్ పే ను కోట్లాది మంది వాడుతున్నారు.

Second Wave: నాడు అగ్ర‌రాజ్యాన్ని నేడు భార‌త్‌ను Covid చుట్టుముట్టింది!

Second Wave: నాడు అగ్ర‌రాజ్యాన్ని నేడు భార‌త్‌ను Covid చుట్టుముట్టింది! Second Wave: క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్‌ను చుట్టుముట్టింది. ప్ర‌జ‌లెవ్వ‌ర్నీ ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. మునుపెన్న‌డూ లేనంత ఉధృతితో Read more

The joe: Joe Biden Inauguration updates: అమెరికా 46 వ అధ్య‌క్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం

The joe Washington: ప్ర‌పంచంలోనే అగ్ర‌దేశం అమెరికా 46వ అధ్య‌క్షుడిగా జో బైడెన్ బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. దేశ ఉపాధ్య‌క్షురాలుగా భార‌త సంత‌తికి చెందిన క‌మ‌లా Read more

PM Narendra Modi Wants to Ban Cryptocurrencies

Earlier, the RBI had completely cryptocurrency like Bitcoin. However, in March 2020, the Supreme Court lifted the ban. The highest Read more

adult vaccination india: పెద్ద‌వాళ్లు వేసుకునే టీకాల గురించి తెలుసా?

adult vaccination india సాధార‌ణంగా టీకాలు చిన్న పిల్ల‌ల‌కే వేస్తార‌నుకుంటాం. కానీ పెద్ద‌వాళ్ల‌కూ టీకాలుంటాయి. అది ప్ర‌స్తుత కాలంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల తెలిసింది. అంద‌రూ టీకాలు Read more

Leave a Comment

Your email address will not be published.