good eating habits | ప్రస్తుతం ఎండలు(summer) మండిపోతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చిన్నలు, పెద్దలు అల్లాడిపోతున్నారు. పెరిగే ఉష్ణోగ్రతలను వేర్వేరు రూపాల్లో తగ్గించుకునే మార్గాలు న్నాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారం తీసుకోవడం ద్వారా ఉపశమనం పొంద వచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. వేడిని తగ్గించుకునేందుకు, వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ఆహారపు అలవాట్ల(good eating habits)లో మార్పులు చేసుకోవాలి.
నీరే ఉత్తమం!
వేసవిలో ఇంట్లోంచి బయటకి వెళ్లినప్పుడు వెంట నీళ్ల సీసా తీసుకెళ్లినా కొద్ది గంటల్లోనే వేడుక్కుతాయి. చేసేది లేక బయట చల్లగా దొరికే పానీయాల వైపు మనసు మళ్లుతుంది. డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు మళ్లీ నీరే కొనాలా? ఎక్కువ మంది ఆలోచన ఇలాగే ఉంటుంది. ఫలితంగా ఇతర పానీయాలను ఎక్కువ మంది సేవిస్తుంటారు. అప్పటి వరకు బాగానే ఉన్నా ఆ వెంటనే దాహం వేస్తుంది. వీటన్నింటికంటే బయటికి వెళ్లినప్పుడు మంచినీరు తాగడం మంచిది. శరీరంలోని చెమట రూపంలో వెళ్లే నీటిని ఇది భర్తీ చేస్తుంది.

మరీ చల్లగా వద్దు!
దాహంగా ఉందని మరీ చల్లగా తీసుకోవద్దు. ఒక వేళ తీసుకున్నా మళ్లీ దాహం తప్పదు. పైగా అతి చల్లని పానీయాలు పళ్లను దెబ్బతీస్తాయి. ఫ్రిజ్‌లోని బాటిళ్లలో నీరు చల్లగా ఉంటుంది. పూర్తిగా చల్లబడిన బాటిల్‌ను ఫ్రిజ్ బయట పెట్టుకోవాలి. గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు కొద్ది సమయం పడుతుంది. అప్పటి వరకు నీరు చల్లగా ఉంటుంది కాబట్టి తాగొచ్చు. అవకాశం ఉంటే వేసవిలో ఇంట్లో కొత్త కుండ ఒకటి ఉంచి అందులోని నీరు తీసుకుంటే చల్లగా ఉంటుంది.
తక్కువుగా తీసుకుంటే..
కొన్ని పదార్థాలు తింటే వేడి చేస్తుందని చెబుతుంటారు ఇంట్లో పెద్దలు. అది నిజమే. అలాంటి కూరగాయలు, పళ్లు పరిమితంగా తీసుకుంటే సరిపోతుంది. ఈ కాలంలో ముల్లంగి, మిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, బీట్రూట్ వంటివాటిని కాస్త తక్కువుగా తీసుకోవడం మేలు. ఈ సీజన్లో మామిడిపళ్లు నోరూరిస్తుంటాయి. ఇవి కూడా వేడే. అలా అని తినకుండా ఉండలేము. ముందు రోజు రాత్రి నీళ్లో వేసి మరుసటి రోజు తినడం మేలు.
తాజావి చూడండి!
వేసవిలో కూరగాయాలైనా, పళ్లైనా త్వరగా పాడవుతాయి. ఎప్పటికప్పుడు తాజాగా ఉన్నవే తీసుకోండి. కూరగాయాల్లో ఉండే నీరంతా పోయాక తిన్నా ఉపయోగం లేదు. పైగా ఈ కాలంలో వేపుడు కాకుండా, పులుసు మాదిరి చేసుకోవడం, నీరు అధికంగా ఉంటే టమోటా వంటివి కలుపుకొని వండుకోవడం మేలు. మసాలాలకు దూరంగా ఉండాలి.
సలాడ్స్ ప్రయత్నిస్తే!
కూరగాయలు, పళ్లను సలాడ్స్ రూపంలో తీసుకోవడం ఉత్తమం. అన్నం ఎక్కువుగా సహించదు కాబట్టి వీటిని ప్రయత్నంచవచ్చు. చక్కెర వేసుకోవద్దు. ఉప్పుకూడా చాలా పరిమితం గానే.. విరివిగా దొరికే కీర వంటివి సలాడ్స్‌కు బాగుంటాయి. దాహం తీరుస్తాయి.

చల్లగా ఉండేందుకు!
ఉదయంపూట అల్పాహారం ఏం చేద్దామా అని చాలా మంది గృహిణులు మదనపడుతుంటారు. వడ, దోశ వంటవి తింటే దాహం వేస్తుంటుంది. జొన్న, రాగి అంబలి వంటివి చల్లగా ఉంచుతాయి. ఇందులో మజ్జిగ కలిస్తే రుచికరంగా ఉంటుంది. సబ్జా పానీయం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో చల్ల దనాన్ని ఇస్తుంది.ఎండ వేళ, సాయం కాలం నిమ్మరసం, మామిడి షర్బత్, పల్చటి మజ్జిగ కూడా వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి