Gold Missing Case : Peddapalli : అత్యాశకు పోయి మంచిపేరు కాస్త పోగొట్టుకున్నారు అంబులెన్స్ సిబ్బంది. మనిషి ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో వారి చొరవ అంతా ఇంతా కాదు. గాయపడ్డ మనిషి మళ్లీ ప్రాణంతో బ్రతికి ఉన్నాడంటే కేవలం అంబులెన్స్ సిబ్బందే కారణం. ఇక్కడి వరకు వారికి చేతులెత్తి నమస్కరించాల్సిందే. కానీ బంగారంపై కన్నుపడటంతో అత్యాశకు పోయిన వారి మంచి బుద్ధి కాస్త చెడ్డవారిగా చేసింది. వివరాల్లోకి వెళితే…తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 2.30 కేజీల బంగారం మాయమైన విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును రామగుండం పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ మీడియాకు వివరాలు వెల్లడించారు.
రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారు వర్తకులు,సోదరులైన కొత్త శ్రీనివాసరావు, రాంబాబు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ డి.సంతోష్, గుమస్తా గుండా సంతోష్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వారి కారు డివైడర్ను ఢీకొట్టడంతో దాదాపు 100 అడుగుల దూరంలో ఉన్న సైన్ బోర్డును బలంగా తాకుతూ పక్కనున్న కాల్వలోకి దూసుకుపోయింది.
గాయపడిన వారిని 108 వాహనంలో గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాపారుల వద్ద 5.60 కేజీల బంగారం ఉందని వారి కుటుంబసభ్యులు పోలీసులకు తెలియజేశారు. అయితే 108 సిబ్బంది మాత్రం 3.30 కిలోల బంగారాన్ని మాత్రమే ఎస్సై శైలజకు అప్పగించారు. దీంతో మరో 2.30 కేజీల బంగారం మిస్ అయినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలు దొంగలు దొరికారు!
అయితే 24 గంటల్లో అసలు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న 108 డ్రైవర్ లక్ష్మారెడ్డి, ఎమర్జెన్సీ టెక్నీషియన్ తాజుద్దీన్ 2.300 కేజీల బంగారాన్ని దాచిపెట్టారు. మిగిలిన బంగారాన్ని పోలీసులకు ఇచ్చారు. అయితే బంగారం మిస్(Gold Missing Case) అయిన నేపథ్యంలో పోలీసులు 108 సిబ్బందిని విచారించారు. పోలీసుల విచారణలో వారు నిజాన్ని ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..108 సిబ్బంది అత్యాశ వారికి చెడ్డపేరు తీసుకొచ్చేలా చేసిందని చెప్పారు. అత్యవసర సేవలు అందించే సిబ్బంది ఇలాంటి పనులు చేయకూడదని హితవు పలికారు.
ఇది చదవండి: 26న దేశవ్యాప్తంగా బంద్కు పిలుపు!
ఇది చదవండి:కిడ్నాప్ నాటకమాడిన యువతి ఆత్మహత్య
ఇది చదవండి:దెయ్యం భయ్యం..కాలనీ ఖాళీ చేసిన ప్రజలు
ఇది చదవండి:షరతులపై విరసం నేతకు బెయిల్ మంజూరు
ఇది చదవండి:కోవిడ్ వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల
ఇది చదవండి:ఖాకీ మాటున మానవత్వాన్ని చూపిన ప్రతి పోలీసుకు సెల్యూట్: డీజీపీ
ఇది చదవండి:మళ్లీ పంజా విప్పుతోన్న కరోనా