Godavarikhani | పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ అనుబంధంగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా సర్వసభ్య సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సమస్యలపై చర్చిం చారు. పలు తీర్మానాలు చేశారు. ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్ట్ బండారి కిష్టయ్య, రామ్ చందర్, వేముల రమణ, తోట వెంకటేష్ మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు(Godavarikhani) అర్పించారు.
అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా డి.చంద్ర శేఖర్(ABN-TV), ఆరెల్లి కుమార్ (CVR-TV), కోశాధికారిగా గంటా రవీందర్(T-NEWS), ఆర్గనైజింగ్ సెక్రటరీగా బూరగడ్డ శ్రీమన్నారాయణ గౌడ్(N-TV), జాయింట్ సెక్రటరీగా బైరం సతీష్(I-NEWS), ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ మామిడి, కనకయ్య లను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నాగపురి సత్యం, పూదరి కుమార్, రాజ్ కుమార్, బుర్రా వీర గౌడ్, చిరంజీవి, ఆవుల కృష్ణ, నరసింహ చారి, చిరంజీవి, తిరుపతిరెడ్డి, రంగు.తిరుపతి, శ్రీనివాస్, మూల.శంకర్, రమేష్, విజయ్, శంకర్, కిషన్, హకీం తదితరులు పాల్గొన్నారు.
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?