Goa Incident Driver Srinivas | 20 మంది టూరిస్టులను బస్సులో తీసుకెళ్లి గోవాలో దింపి వస్తున్న టూరిస్టు బస్ డ్రైవర్ హఠాత్తుగా కిడ్నాప్ కు గురయ్యాడు. కేవలం గత నెలలో మూడు రోజుల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలో చివరకు డ్రైవర్ తీవ్రమైన గాయాలతో, సరిగ్గా మాటలాడలేని స్థితిలో హైదరాబాద్ నగరానికి చేరుకున్నాడు. ఇంతకీ గోవాలో ఏం జరిగింది. ఎవరు అతనిపై దాడి చేశారు? రెండ్రోజులుగా కుటుంబ సభ్యులకు ఫోన్ కాంటాక్టులో లేని భర్త తిరిగి ప్రాణాలతో ఇంటికి వచ్చినప్పటికీ గాయాలతో అతన్ని చూసి కుటుంబ సభ్యులు మనో వేదనతో నిండిపోయారు. ఈ ఘటన గోవాలో జరగడంపై ఇప్పుడు టూరిస్టులకు ఆందోళన రేకేత్తించే అంశంగా మారింది.
Goa Incident Driver Srinivas
హైదరాబాద్ నగరం, బోరబండకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ గత నెల రోజుల కిందట చౌటపల్ నుండి 20 మంది టూరిస్టు ప్రయాణికులను గోవాలో దించేందుకు వెళ్లారు. రెండ్రోజుల వ్యవధిలోనే గోవాకు చేరుకున్న టూరిస్టు బస్సు 20 మంది ప్రయాణికులను దింపి తిరిగి హైదరాబాద్ నగరం బయలు దేరింది. గత నెల 20 తేదీన గోవా బయలు దేరిన బస్సు వచ్చే క్రమంలో డ్రైవర్ శ్రీనివాస్ గోవాలోనే కిడ్నాప్‌కు గురయ్యాడు. కొంత మంది గుర్తు తెలియని దుండగులు తనని వెంబండించారని బాధితుడు పేర్కొన్నారు. తలపైన, ఒంటిపైన గాయాలు చేయడంతో మాట్లాడలేని పరిస్థితితో పాటు ఇంకా షాక్ లో నుండి తేరుకోలేదు.
20 రోజులుగా కుటుంబ సభ్యులు డ్రైవర్ శ్రీనివాస్ ఆచూకీ కోసం వెతికారు. ఎక్కడా కూడా తన సమాచారం తెలియరాలేదు. చివరకు మంగళవారం రాత్రి శ్రీనివాస్ తన ఇంటికి చేరుకున్నాడు. కొందరు దుండగులు కిడ్నాప్ చేసి కారు ఎక్కించుకొని సంతకం పెట్టాలని ఒత్తిడి చేసినట్టు చెప్పాడు. తాను సంతకం పెట్టననడంతో లాఠీలతో దారుణంగా కొట్టారని చెప్పారు. సంతకం పెడితే రెండు లక్షలు ఇస్తామని చెప్పారని, వాళ్లు కొడుతుండంతో కారు రన్నింగ్‌లోనే కిందకు దూకానని, రోడ్డు దాటి ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక వాగులో దూకానని తెలిపారు. అయినప్పటికీ వాగులో నుంచి తీసుకొచ్చి మళ్లీ దాడి చేశారని వాపోయాడు.

వాళ్లు డ్రెస్‌కోడ్ వేసుకొని ఉన్నారని, ఒక బ్యాచ్‌గా ఉన్నారని శ్రీనివాస్ తెలిపారు. వెంటనే అలానే గాయలతో కమిషనర్ ఆఫీసుకు వెళితే ఓ సిఐ సార్ బాధపడి ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎక్కించారని, రూ.200 ఖర్చులకు ఇచ్చారని తెలిపారు. అక్కడ నుండి పటాన్ చెర్వు వద్ద దిగి, ఆటోలో రైల్వే స్టేషన్‌కు వచ్చి అక్కడ నుండి ఇంటికి చేరుకున్నానని తెలిపారు. డ్రైవర్ శ్రీనివాస్ కు మత్తు మందు ఇచ్చి అవయవాలు తీసుకొని తల వద్ద, పొట్ట భాగంలో కుట్లు వేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ ఘటన గోవాలో జరగడంతో అక్కడే దర్యాప్తు జరుగుతుందని తెలిపినట్టు పోలీసు వారు తెలిపినట్టు వారు పేర్కొన్నారు. గోవా ప్రభుత్వం డ్రైవర్ శ్రీనివాస్‌కు జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టి, దుండగలను గుర్తించి శిక్ష వేయాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!