Giddaluru News : Giddaluru CI | కరోనా సేవలకుగాను సీఐకి ప్రశంసాపత్రం అందజేత
Giddaluru News : Giddaluru CI | కరోనా సేవలకుగాను సీఐకి ప్రశంసాపత్రం అందజేత Giddaluru: ప్రకాశం జిల్లా గిద్దలూరు సిఐ సుధాకర్‌రావు ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చేతుల మీదుగా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమక్షంలో సిఐ సుధాకర్ రావు ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కరోనా సమయంలో సీఐ సుధాకర్ రావు సేవలు వెలకట్టలేనివని వారు ప్రశంసించారు. కరోనా లాక్డౌన్ సమయంలో గిద్దలూరు సర్కిల్లో ఎస్సైలు కొందరు కరోనా భారిన పడ్డారు. మరికొందరు అందుబాటులో లేరు. అయితే అదే సమయంలో వన్ మెన్ ఆర్మీ షో తో రాత్రనకా, పగలనకా ప్రజలకు మెరుగైన సేవలు అందించారు. ఆయన చేసిన సేవలకు గాను ప్రశంసాపత్రాన్ని అందుకోవడం పట్ల ప్రజలు పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఇది చదవండి:పంచాయతీ ఎన్నికలు జరిగే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల వివరాలు
ఇది చదవండి:నూతన సచివాలయం నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్