GHMC Elections 2020 Reservation | గెలిచే అభ్యర్థుల కోసం పార్టీల వెతుకులాట!
GHMC Elections 2020 Reservation | గెలిచే అభ్యర్థుల కోసం పార్టీల వెతుకులాట!హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ రిజర్వేషన్లకు తగ్గట్టుగా తమ అభ్యర్థలను ఎంపిక చేసే ప్రక్రియను చాలా వేగవంతంగా చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలావాలనే సంకల్పంతో రాజకీయ పార్టీలన్నీ ముందుగా గెలిచే అవకాశం ఉన్న వారిని ఏరికోరి వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కసరత్తులు చేస్తున్నాయి.
ఏ వార్డు ఎవరికంటే?
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగరా మోగిన సందర్భంలో పాత రిజర్వేషన్ల ఆధారంగానే ఈ సారి కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎస్ ఈసీ పార్థ సారథి వెల్లడించారు. ఈ సారి మేయిర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించినట్టు తెలిపారు. మొత్తంగా ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 18,19,20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించ నున్నట్టు తెలిపారు. 21వ తేదీ నాటికి పరిశీలిస్తామన్నారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను, కేటాయించిన గుర్తులను ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 1 ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించారు. 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.
ఏ వర్గానికి రిజర్వు అయ్యిందంటే?
ఎస్టీ(జనరల్)
– ఫలక్ నామా
ఎస్టీ (మహిళ)
-హస్తినపురం
ఎస్సీ(మహిళ)
రాజేంద్రనగర్, కవాడిగూడ, అడ్డగుట్ట, మెట్టుగూడ, బన్సీలాల్‌పేట
బీసీ (జనరల్)
– చర్లపల్లి, సిక్చవానీ, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, శాలిబండ, గోశామహల్, పురాణపూల్, దూద్‌బౌలీ, రామ్నాస్పుర, కిషన్‌బాగ్, శాస్త్రిపురం, దత్తాత్రేయ నగర్, కార్వాన్, నానాల్ నగర్, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, అంబర్‌పేట, బోలఖ్పూర్, బోరబండ, రామచంద్రాపూరం, పటాన్చెరువు, గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్.
బీసీ(మహిళ)
– రామాంతపూర్, పాత మలక్‌పేట్, తలాబ్ చంచాలమ్, గౌలిపుర, కుర్మగూడ, కంచన్‌బాగ్,బార్కాస్, నవాబ్సామెబ్ కుంట, ఝాన్సీ బజార్, సులేమాన్ నగర్, అత్తాపూర్, మంగళ హాట్, గోల్కొండ, టోలీచౌకి, ఆసిఫ్ నగర్,విజయ్‌నగర్ కాలనీ, అహ్మద్ నగర్, మల్లేపల్లి,రెడ్‌హిల్స్, గోల్నాక, ముషీరాబాద్, ఎర్రగడ్డ, చింతల్, బౌద్ధనగర్, రాంగోపాల్ పేట.
జనరల్(మహిళ)
ఏఎస్రావు నగర్, నాచారం, చిలకనగర్, హబ్సిగూడ, ఉప్పల్,నాగోల్, సరూర్ నగర్, రామకృష్ణాపురం, సైదాబాద్, ముసారంబాగ్, ఆజంపుర, ఐఎస్ సదన్, లంగర్ హౌజ్, గన్ ఫౌండ్రీ, హిమాయత్ నగర్, కాచిగూడ, నల్లకుంట, బాగ్ అంబర్‌పేట, అడిక్‌మెట్, గాంధీ నగర్, ఖైరతాబాద్, వెంకటేశ్వర కాలనీ, సోమాజీగూడ, సనత్‌నగర్, హఫీజ్‌పేట్, చందానగర్, భారతీనగర్, బాలాజీ నగర్,అల్లాపూర్, వివేకానందన్ నగర్ కాలనీ, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అల్వాల్, నేరేట్మెట్, వినాయకనగర్, మౌలాలీ, గౌతమ్ నగర్, తార్నాక, సితాఫల్ మండి, బేగంపేట, మోండా మార్కెట్.