GHMC Elections 2020 Polling date | 1న పోలింగ్‌..4న ఫ‌లితాలు

మోగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల న‌గారా

GHMC Elections 2020 Polling date | 1న పోలింగ్‌..4న ఫ‌లితాలు హైద‌రాబాద్‌ : రాష్ట్ర రాజ‌ధానిలో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. డిసెంబ‌ర్ 1వ తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నుందని స్టేట్ ఎల‌క్ష‌న్  క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించారు. న‌వంబ‌ర్ 18, 19, 20 నుంచి నామినేష‌న్లు స్వీక‌ర్ణ‌, 21 ప‌రిశీల‌న‌, 22న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌ర‌కు నామినేష‌న్ల విత్ డ్రాకు అవ‌కాశంతో పాటే అదే రోజు అభ్య‌ర్థులు ఫైన‌ల్ కావ‌డం, డిసెంబ‌ర్ 1న ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు, 3న అవ‌స‌ర‌మైతే రీపోలింగ్‌, జీహెచ్ఎంసీ మేయ‌ర్ జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు కేటాయింపు. జీహెచ్ఎంసీ జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు నామినేష‌న్ డిపాజిట్ రూ.5 వేలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీల‌కు రూ.2500 నామినేష‌న్ డిపాజిట్‌, డివిజ‌న్ అభ్య‌ర్థి ఖ‌ర్చు రూ.5 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించారు.

GHMC Elections 2020

నామినేష‌న్ ట‌ర్మ్ పూర్త‌య్యే లోపు ఎల‌క్ష‌న్లు నిర్వ‌హించాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంద‌న్నారు పార్థ‌సార‌థి. 2016 రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కార‌మే ఎల‌క్ష‌న్లు జ‌రుగుతున్నాయ‌న్నారు. 150 వార్డుల‌కు 150 కౌంటింగ్ సెంట‌ర్లు ఉంటాయ‌న్నారు. బ్యాలెట్ బాక్స్ ద్వారా ఎల‌క్ష‌న్లు జ‌రుగుతాయ‌న్నారు.

గ్రేట‌ర్ లో మొత్తం 74 ల‌క్ష‌ల 4 వేల 286 ఓట‌ర్లు ఉన్నార‌న్నారు. అందులో పురుషులు 38 ల‌క్ష‌ల 56 వేల 770, మ‌హిళ‌లలు 35 ల‌క్ష‌ల‌46 వేల 847 , ఇత‌రులు 669, పోలింగ్ కేంద్రాలు 9248, గ్రేటర్ లో 150 వార్డులు, గ్రేట‌ర్ లో అతిపెద్ద డివిజ‌న్ మైలార్ దేవ్‌ప‌ల్లిలో 79 వేల 290 మంది ఓట‌ర్లు ఉన్నారు. అతిచిన్న డివిజ‌న్ అయిన రామ‌చంద్రాపురంలో 27 వేల 948 మంది ఓట‌ర్లు ఉన్నారు.

చ‌ద‌వండి :  Narendra Modi Telugu News | దేశంకు దీపాలై వెలుగు నిస్తున్న‌ సైన్యంకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *