Ghee Health Benefits: నెయ్యి అనగానే వద్దు.. వద్దు అనే వారే ఎక్కువ. నెయ్యి తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని చాలా మంది భయపడుతుంటారు. కానీ ఆ రోజులు ఇప్పుడు మెల్లగా కరిగిపోతున్నాయి. దీనికి కారణం నెయ్యికి ఆరోగ్యకారిణిగా గుర్తించి వాడేవారు ఎక్కవ అవుతుండటమే. ఇంతకు నెయ్యి ఆరోగ్యానికి(Ghee Health Benefits) ఎలా మేలు చేస్తోంది.
పాలల్లో ప్రొటీన్ కాంపోనెంట్ కేసిన్ కారణంగా ఎలర్జీలు వస్తాయనే అభిప్రాయం ఉంది. నిజానికి నెయ్యిని తయారుచేసేటప్పుడు పొలాల్లో ఉండే లాక్టోస్ కేసిన్లు పైకి తేలుతాయి. ఇలా నెయ్యిపై తేలిన వాటిని తీసేస్తారు. కొవ్వును కరిగించే విటమిన్లు నెయ్యిలో ఉన్నాయి. వాటిల్లో విటమిన్ – ఇ, ఎ, కెలు కూడా ఉన్నాయి. ఇవి కంటి చూపును ఆరోగ్యంగా ఉంచడమే కాదు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.


పెద్దప్రేగు ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. నెయ్యి వాడకం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఇన్సులిన్ ప్రమాణాలు సరిసమానంగా ఉంటుంది. శరీరంలో ఇతర కొవ్వు, కలుషితమైన పదార్థాలు సులువుగా బయటకు పోయేలా సహకరిస్తుంది. నెయ్యిలో విటమిన్ కె2 పుష్కలంగా ఉంటుంది.ఎముకలకు కావాల్సినంత కాల్షియంను అందజేస్తుంది కూడా.
బ్రెయిన్ బాగా పనిచేయడానికి ఆరోగ్యవంతమైన ఫ్యాట్ అవసరం. అలాంటి మంచి ఫ్యాట్స్ ఎన్నో నెయ్యిలో ఉన్నాయి. నెయ్యి వాడకం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆవు నెయ్యి వాడకం ఆరోగ్యానికి మంచింది. ప్రతి రోజూ పెరుగును చిలికి వెన్న తీసి పిల్లలకు పెడితే మేధావంతులుగా, ఆరోగ్యకరంగా పెరుగుతారు.


వెన్నను శరీరానికి మర్ధన చేసినట్టయితే చర్మానికి వర్చసును, మృదుత్వాన్ని ప్రసాదిస్తుంది. నీరసించే పిల్లలకు, బలహీనులకు గుండె బలం తక్కువుగా ఉన్నవారికి వెన్న అత్యుత్తమమయినది.
ఆవు వెన్నకు, గేదె వెన్నకు చాలా తేడా ఉంటుంది. శరీరానికి అవసరమైన చమురు గుణాన్ని కలుగజేసి, చలవును, ధృడత్వాన్ని కలిగించడంంలో రెండు అత్యుత్తమమైనవే. గేదె వెన్న కంటే ఆవు వెన్న సులభంగా జీర్ణమవుతుంది.


వాతము, పిత్తమును క్రమబద్ధీకరించి, రక్త దోషము, క్షయ, మూలవ్యాధులను నివారించడంలో ఆవు నెయ్యి విశిష్టమైనది. అంతేగాక, ఈ రెండు రకాల వెన్న బలాన్ని వీర్యవృద్ధిని, వర్ఛస్సును కలుగుజేస్తాయి. వెన్నలో పంచదార కలిపి తీసుకుంటే కడుపులో మంట, పోట్లు సమసిపోతాయి. తేనె, చెరుకురసం, ఉప్పు వెన్నకు విరుగుడు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?