Ghatkesar Kidnap Drama

Ghatkesar Kidnap Drama: కిడ్నాప్ నాట‌క‌మాడిన యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

తెలంగాణ‌

Ghatkesar Kidnap Drama: Ghatkesar : తెలంగాణ రాష్ట్రంలోనే సంచ‌ల‌నం సృష్టించిన ఘ‌ట్ కేస‌ర్ కిడ్నాప్ కేసు డ్రామా ఆడిన ఫార్మ‌సీ విద్యార్థిని మంగ‌ళ‌వారం ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ నెల 10న ఘ‌ట్‌కేస‌ర్ లో బీ ఫార్మ‌సీ చ‌దువుతున్న విద్యార్థిని త‌న‌ను న‌లుగురు ఆటో డ్రైవ‌ర్లు కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన‌ట్టు పోలీసుల‌కు తెలిపింది. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు శ‌ర‌వేగంగా ఆమె కేసును చేధించారు. సిసీ కెమెరాల పుటేజీ ఆధారంగా ఆటోడ్రైవ‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ యువ‌తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే పోలీసుల విచార‌ణ‌లో పొంత‌న లేని స‌మాధానాలు చెప్ప‌డం, సిసీ పుటేజీలో కేవ‌లం యువ‌తి మాత్ర‌మే న‌డుచుకుంటూ వెళ్ల‌డం లాంటి ఆధారాల‌ను ప‌రిశీలించిన పోలీసులు ఇది డ్రామా కిడ్నాప్‌గా తేల్చేశారు. ఆటోడ్రైవ‌ర్ల‌ది ఇందులో ఎలాంటి త‌ప్పు లేద‌ని సీపీ మ‌హేష్‌భ‌గ‌వ‌త్ మీడియా ఎదుట తెలియ‌జేశారు. ఇది కేవ‌లం ఆ యువ‌తి ఆడిన క‌ట్టు క‌థ అని తేల్చ‌డంతో పాటు ఆ యువ‌తి మాన‌సిక స్థితి స‌రిగ్గా లేద‌ని కూడా నిర్థార‌ణ‌కు వ‌చ్చారు.

అయితే ఆ కేసు విష‌య‌మై త‌న‌ను ఎలాగైనా వేధిస్తార‌ని, త‌న‌ను అరెస్టు చేస్తార‌ని భ‌యాందోళ‌న‌కు గురైన బీ ఫార్మ‌సీ విద్యార్థిని అమ్మ‌మ్మ వాళ్ల ఇంటిలో షుగ‌ర్ ట్యాబ్లెట్ల‌ను మంగ‌ళ‌వారం మింగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. విష‌యం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు స‌మీప ఆసుప‌త్రిలో చేర్చించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. అయితే కేసు విష‌యంలో యువ‌తి బాగా డిప్రెష‌న్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఈ కిడ్నాప్ డ్రామా ఘ‌ట‌న విష‌యంలో బంధువులు, స్నేహితులు నుంచి అవ‌మానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న యువ‌తి ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్టు కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. మొత్తంగా ఘ‌ట్‌కేస‌ర్ కిడ్నాప్ డ్రామా కేసులో యువ‌తి ప్రాణాలు తీసుకోవ‌డం ఆ కుటుంబానికి విషాధం నింపింది.

ఇది చ‌ద‌వండి:దెయ్యం భ‌య్యం..కాల‌నీ ఖాళీ చేసిన ప్ర‌జ‌లు

ఇది చ‌ద‌వండి:ష‌ర‌తుల‌పై విర‌సం నేత‌కు బెయిల్ మంజూరు

ఇది చ‌ద‌వండి:కోవిడ్ వ‌ల్లే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుద‌ల

ఇది చ‌ద‌వండి:ఖాకీ మాటున మాన‌వ‌త్వాన్ని చూపిన ప్ర‌తి పోలీసుకు సెల్యూట్: డీజీపీ

ఇది చ‌ద‌వండి:మ‌ళ్లీ పంజా విప్పుతోన్న క‌రోనా

ఇది చ‌ద‌వండి: ‘ఉద్దానం’పై ఏం ఆలోచిస్తున్నారు: హైకోర్టు

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *