Gautam Adani vs Mukesh Ambani: ఆసియా నెంబర్ వన్ కుబేరుడు ముఖేశ్ అంబానీకి ఝలక్ తగిలిన వార్త ఇప్పుడు వచ్చింది. గౌతమ్ ఆదానీ ఇప్పుడు ఆసియా నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్‌గా తాజాగా రికార్డుకెక్కారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదానీ సంపద రూ.88.50 బిలియన్ డాలర్లు కాగా, ముఖేశ్ అంబానీ సంపద రూ.87.90 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీ 10వ స్థానం నుంచి 11వ స్థానానికి(Gautam Adani vs Mukesh Ambani) పడిపోయారు.
ముఖేశ్‌కు ఝలక్
అటు దేశంలోనూ ఇటు ఆసియాలోనూ నెంబర్.1 కుబేరుడు హోదాలో కొనసాగుతున్న ముఖేశ్ అంబానీకి ఝలక్ తగిలింది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ(Gautam Adani) తాజాగా 90.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే నెంబర్.1 రిచెస్ట్ పర్సన్‌గా నిలిచారు. నిన్నటి వరకూ ఆసియాలో నెంబర్ వన్ కుబేరుడి స్థానంలో కొనసాగిన అంబానీ నుంచి ఆయన ర్యాంకును గౌతమ్ ఆదానీ లాగేసుకున్నారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాల్లో 10వ స్థానంలోకి ఎగబాకారు అదానీ.
ఫిబ్రవరి 8న జరిగిన బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్(bloomberg billionaires index)లో వీరిద్దరి స్థానాలు మారాయి. బ్లూంబర్గ్ ప్రపంచ కుబేరుల 500 జాబితాలో ఫిబ్రవరి 8న మార్పులు చోటు చేసుకున్నాయి. గౌతమ్ అదానీ సంపద 88.50 బిలియన్ డాలర్లు కాగా, ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) సంపద 87.90 బిలియన్ డాలర్లుగా ఉంది. ముకేశ్ కంటే అదానీ సంపద 600 మిలియన్లు ఎక్కువ కావడంతో ఆసియాలోనే నెంబర్ వన్ ధనవంతుడుగా అవతరించారు అదానీ. బ్లూంబర్గ్ ఇండెక్స్‌లో ప్రపంచ కుబేరుల జాబితాలో ఇప్పటి వరకు పదో స్థానంలో కొనసాగిన ముఖేశ్ అంబానీ తాజాగా 11వ స్థానానికి పడిపోయారు. ఒక స్థానాన్ని మెరుగుపర్చుకోవడానికి 11వ ప్లేస్ నుంచి 10వ స్థానానికి గౌతమ్ ఆదానీ చేరుకున్నారు. ఈ ఏడాది (2022) ముఖేశ్ అంబానీ సంపద 2.07 బిలియన్లు తగ్గగా 12 బిలియన్లు ఆదానీ సంపద పెరిగింది.
ఫిబ్రవరిలో రిలయన్స్ షేరు ధర రూ.2312 దగ్గర ట్రే డై గతేడాది కాలంలో ఈ షేరు ధర 18 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో అదానీ కంపెనీ షేరు ఏకంగా 170 శాతం వృద్ధి చెంది రూ.1741 దగ్గరకి చేరుకుంది. దీంతో అదానీ సంపద గణనీయంగా పెరగడంతో ఆసియా నెంబర్ వన్ కుబేరుడు స్థానానికి గౌతమ్ అదానీ చేరినట్టు బ్లూంబర్గ్ తెలిపింది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!