Gauri Lankesh దేశంలోని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, మానవ హక్కుల ఉద్యమ నాయకురాలు 55 ఏళ్ల గౌరీ లంకేష్ 5 సంవత్సరాల క్రితం 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని రాజరాజేశ్వరి నగరంలో హత్యకు గురయ్యారు. ఆమె మరణవార్త దేశానికే కాదు..యావత్తు ప్రపంచానికి వినపడింది. ఆమె పోరాటాలను సహించలేక మూఢత్వంతో కళ్లు మూసుకుపోయిన కొందరు ముష్కరులు గౌరీ లంకేష్(Gauri Lankesh)ను హత్యచేశారు. ఈ హత్య వెనుక కొన్ని మతోన్మాద శక్తులూ, రాజకీయ కుట్రలు ఉన్నట్టు తేలింది.
దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రజల మధ్య ప్రజా జీవితం గడిపిన జర్నలిస్టు గౌరీ లంకేష్ ను హత్య చేసినప్పటికీ దేశవ్యాప్తంగా మొదలైన ఆందోళనలు మతతత్వ శక్తులకు గుండెల్లో రైళ్లు పరిగేలా చేశాయి. దేశంలో సమానత్వాన్ని కోరుకుంటూ, లౌకిక వాదానికి కట్టుబడి ఉన్న గౌరీ లంకేష్‌ను భౌతికంగా నిర్మూలిం చి అలాంటి ఉద్యమ శక్తులను బెదిరించాలనేది వారి సంకేతం. కానీ అది కుదరకపోగా మరింత మంది ఉద్యమ కారులు తయారయ్యారు.
తన తండ్రి పేరుతో లంకేష్ పత్రికను నడిపి మతన్మోద శక్తులను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్, కన్నడం భాషల్లో పలు స్పూర్తిదాయకమైన రచనలు చేశారు. సరిగ్గా గౌరీ లంకేష్ హత్య కంటే ముందు 2013 ఆగష్టు 20వ తేదీన నరేంద్ర దబోల్కర్, 2015 ఫిబ్రవరి 20న గోవింద్ పన్సారేతో పాటు అదే ఏడాది ఆగష్టు 30వ తేదీన ఎంఎం కల్బుర్గితో పాటు ఎందరో దేశవ్యాప్తంగా కవులు, జర్నలిస్టులు హిందూ మతోన్మాద శక్తుల చేతుల్లో హత్యలకు గురుయ్యారు. గౌరీ లంకేష్ హత్య తరువాత దేశంలో మతోన్మాద శక్తుల హత్యలు మరికొన్ని చరిత్ర పుటల్లోనుంచి వెలుగులోకి వచ్చాయి. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆమె కు నివాళి ప్రకటించాయి. అలాంటి గొప్ప సంఘ సమాజ నాయకులురాలు, ఉద్యమ పటిమ ఉన్న జర్నలిస్టు గౌరీ లంకేష్ పుట్టిన రోజు(జనవరి 29) నేడు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ