Gas leak accidentనెల్లూరు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తెల్లతెల్లవారంగానే ఆ ఇంటిలో మృత్యు ఆర్తనాదాల కేకలు వినిపించాయి. గ్యాస్ పేలి ఒకే ఇంటిలో ముగ్గురు మృతి చెందారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామలో సోమవారం తెల్లవారుజామున మహిళకు మంటలు అంటుకోగా మంట ఆర్పే ప్రయత్నంలో భర్తకు కూడా మంటలు (Gas leak accident)అంటుకున్నాయి. ఈ ఘటనలో భార్య, భర్తలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. వారితో పాటు ఉన్న 13 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలిక కూడా మృతి చెందింది.


సయ్యద్ అబ్బాస్(42) కుటుంబం చిన్న Tiffen center పెట్టుకుని జీవిస్తుండగా సోమవారం అబ్బాస్ భార్య సయ్యద్ నౌషాద్ (38) గ్యాస్ మీద సాంబార్ రెడీ చేస్తుండగా ప్రమాదవశాత్తు regulater pipe లీకయ్యింది. ఈ ఘటనలో పెద్ద మంట రావడంతో అబ్బాస్ భార్యకు మంటలు అంటుకోగా ఆర్పే ప్రయత్నం చేసిన అబ్బాస్‌కు తర్వాత అక్కడే ఉన్న కూతురు సయ్యద్ అయేషా కు మంటలు అంటుకున్నాయి. అది చిన్న Room కావడంతో చేత ప్రమాద తీవ్రత పెరిగి సంఘటనా స్థలంలోనే దంపతులు చనిపోయినట్టు తెలుస్తోంది. పాపని చికిత్స కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పాప కూడా చనిపోయింది. ఒకే కుటుంబంలో ముగ్గరు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు, అధికారులు ప్రమాద ఘటనను పరిశీలించి విచారిస్తున్నారు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!