Core Web Vitals Assessment: Gas Cylinder Expiray dateగ్యాస్ సిలిండ‌ర్ గ‌డువు ముగిసిందా? లేదా? సులు

Gas Cylinder Expiray dateగ్యాస్ సిలిండ‌ర్ గ‌డువు ముగిసిందా? లేదా? సులువుగా తెలుసుకోండిలా?

Gas Cylinder Expiray dateగ్యాస్ సిలిండ‌ర్‌కు ఎక్స్‌ప‌రీ డేట్ ఉంటుంద‌నే విష‌యం తెలియ‌డం ఎంత ముఖ్య‌మో ఆ ఎక్స్‌పైరీ డేట్‌ని ఎలా తెలుసుకోవాల‌నేది కూడా అంతే ముఖ్యం. ఈ విష‌యాన్ని తెలుసుకోవ‌డం చాలా సుల‌భం. సిలిండ‌ర్ మీద‌నే ఉంటుంది. ఇక్క‌డ కింద ఫొటోలు ప‌రిశీలిస్తే మీకు సులువుగా అర్థ‌మ‌వుతుంది. ఇంగ్లీష్ అక్ష‌రం డి-06 అని న‌ల్ల‌రంగులో పెయింట్ చేసిన అక్ష‌రాలున్నాయి గ‌మ‌నించారా? అంటే ఈ సిలిండ‌ర్‌ని ఉప‌యోగించే కాలం 2006వ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌తో ముగుస్తుంద‌ని అని అర్థం. అలాగే డి-13 అని ఉన్న సిలిండ‌ర్ కాల ప‌రిమితి 2013వ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌తో ముగుస్తుంద‌ని అని అర్థం. ఇక్క‌డ సూచించిన ఇంగ్లీష్ అక్ష‌రం ‘డి‘ ని డిసెంబ‌ర్‌గా అర్థం చేసుకోవ‌చ్చు. కానీ ఇది ఆ నెల పేరులో మొద‌టి అక్ష‌రానికి సూచిక కాదు. గ్యాస్ సిలిండ‌ర్ ఎక్స్‌పైరీని నిర్ధేశించ‌డానికి ఏడాదిని నాలుగు క్వార్ట‌ర్లుగా (Gas Cylinder Expiray date )విభ‌జిస్తారు.

ఇంగ్లీష్ అక్ష‌రంతో పాటు ఆ ఏడాదిలో చివ‌రి రెండు అంకెల‌ను సూచించే ఈ విధానాన్ని అల్ఫా న్యూమ‌రిక‌ల్ సిస్ట‌మ్ అంటారు. అంటే ఏడాదిలో మొద‌టి మూడు నెల‌ల కాలం, బి అంటే ఏప్రిల్ నుంచి జూన్‌, సి అంటే జూలై నుంచి సెప్టెంబ‌ర్, డి అంటే అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు అన్న‌మాట‌. ఉదాహ‌ర‌ణ‌కు ఒక సిలిండ‌ర్ మీద ఇంగ్లీష్ అక్ష‌రం ఎ-14 అని ఉంటే దాని కాలం 2014వ సంవ‌త్స‌రం మార్చి నెల‌తో ముగుస్తుంద‌ని తెలుసుకోవాలి.

ఇదంతా చెప్ప‌డం ఎందుకంటే సిలిండ‌ర్ పేలుడు ప్ర‌మాదాలు ఎక్కువుగా ఎక్స్‌పైరీ ముగిసిన సిలిండ‌ర్ల‌తోనే వ‌స్తుంటాయి. ఇక‌పై మీ ఇంటికి వచ్చిన గ్యాస్ సిలిండ‌ర్ తీసుకునేట‌ప్పుడు దాని బ‌రువుతో పాటు సిలిండ‌ర్ కాల‌ప‌రిమితిని కూడా ప‌రీక్షించండి. (ఇది కేవ‌లం అవ‌గాహ‌న మాత్ర‌మే)

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *