garlic milk benefits in ayurveda: వెల్లుల్లితో కాచిన పాల‌ను తాగితే లాభాలు ఏమిటి?

garlic milk benefits in ayurveda వెల్లుల్లి, ఉల్లిపాయ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి, ఉల్లిపాయ‌లు ఆహారంలో చేర్చుకోవ‌డం ఎంతో మేలు. వీటిలో మంచి ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని ఆయ‌ర్వేద నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలో విట‌మిన్లు, అయోడిన్ వంటివి ఉన్నాయి.

vellulli

వెల్లుల్లితో ఉప‌యోగాలు?

100 గ్రాముల వెల్లుల్లిలో నీటి శాతం 62 ఉండ‌గా, కార్పొహైడ్రేట్స్ 29.8 శాతం, ప్రోటీన్ 6.3 శాతం, కొవ్వు 0.1 శాతం, ధాతువులు 1.0 శాతం, పీచు ప‌దార్థం 0.8 శాతం ఉంటుంది. ఇంకా కాల్షియం 30 మిల్లీ గ్రాములు, పాస్ప‌ర‌స్ 310 మి.గ్రాములు, ఐర‌న్ శ‌క్తి 1.3 మి.గ్రాములు, విట‌మిన్ సీ 13 మిల్లీ గ్రాములు, బి విట‌మిన్ కూడా ఇందులో ఉంద‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలోని వాస‌న‌కు కార‌ణం అందులోని స‌ల్ప‌రే. వెల్లుల్లిలో నీటి ద్వారా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, సైన‌స్ ను నివారిస్తుంది.(garlic milk benefits in ayurveda) టీబీతో బాధ‌ప‌డే వారు ఒక గ్లాసు పాల‌తో ఒక గ్లాసు నీరు, 10 మిరియాలు, కొంచెం ప‌సుపు పొడి, ఒక వెల్లుల్లి బెర‌డును వేసి కాసేపు వేడి చేసి దానిని సేవిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. వెల్లుల్లితో కాచిన పాల‌ను ఉద‌యం, రాత్రి పూట తీసుకుంటే జ‌లుబు, ద‌గ్గు, వాతం వంటి వ్యాధుల‌న్నీ న‌యం అవుతాయి. ఈ పాలు తాగి జ‌లుబు త‌గ్గిపోతే రెండు పూట‌లా తాగ‌డాన్ని ఆపేయాలి. అలాగే ఈ పాల‌ను ఆస్త‌మా వ్యాధిగ్ర‌స్తులు సేవిస్తే శ్వాస‌ప్ర‌క్రియ స‌క్ర‌మ‌మ‌వుతుంది.

వైర‌స్‌కు విరుడుగు వెల్లుల్లి!

వెల్లుల్లి మ‌నం తీసుకునే ఆహారంలో క‌లిపి తీసుకుంటే శ‌రీరంలో వ్య‌ర్థ ప‌దార్థాలు, వైర‌స్ వంటివి తొల‌గిపోతాయి. ఇంకా ర‌క్త క‌ణాల‌ను వెల్లుల్లి శుభ్ర ప‌రుస్తుంద‌ని, అన‌వ‌స‌ర‌మైన కొవ్వును క‌రిగిస్తుంది. త‌ద్వారా శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. దీంతో మ‌న శ‌రీరానికి త‌గిన ఆక్సిజ‌న్ ల‌భించ‌డంతో ఒత్తిడి మాయ‌మ‌వడంతో పాటు న‌రాల ప‌నితీరు, శ్వాస‌ప్ర‌క్రియ క్ర‌మ‌మ‌వుతుంది. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డేవారు మందుల‌తో పాటు పూర్తి వెల్లుల్లిని ఉడికించి రోజూ తీసుకుంటే క్యాన్స‌ర్‌కు చెక్ పెట్ట వ‌చ్చును. అలాగే మొటిమ‌ల‌పై వెల్లుల్లి ర‌సాన్ని రుద్దితే మంచి ఫ‌లితం ఉంటుంది. న‌రాల బ‌ల‌హీన‌త‌కు వెల్లుల్లి బాగా ప‌నిచేస్తుంద‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

vellulli

లావు త‌గ్గ‌డానికి వెల్లుల్లి!

గుండె జ‌బ్బులు క‌ల‌వారు, బాగా లావుగా ఉన్న‌వారు రోజూ రెండు లేదా మూడు చిన్న వెల్లుల్లి పాయ‌ల్ని తింటే లావు త‌గ్గుతారు. స్త్రీల‌లో వ‌చ్చే వ్యాధుల‌కు వెల్లుల్లి అత్యుత్త‌మంగా ప‌నిచేస్తుంది. రుతు దోషాల‌ను పోగొట్టి సంతానాన్ని వెల్లుల్లి క‌లిగిస్తుంది. గుండె జ‌బ్బుల్ని ద‌రిచేర‌నివ్వ‌దు. మాంసాహారం లేదా నూనె, కొవ్వు ప‌దార్థాలు ఎక్కువుగా తీసుకునే వారు త‌ప్ప‌నిస‌రిగా వెల్లుల్లిని వాడాల్సిందే. మాంసాహారం, ఇత‌ర కొవ్వు ప‌దార్థాల‌లో ఉండే కొవ్వుకు విరుగుడుగా వెల్లుల్లి ప‌నిచేస్తుంది. గుండె జ‌బ్బుల్ని ద‌రిచేర‌నివ్వ‌దు. వెల్లుల్లి ని పాల‌తో క‌లిపి ఉడికించి తాగితే అస్త‌మా, క్ష‌య‌, నిమోనియా త‌గ్గుతాయి. అయితే వెల్లుల్లిని అతిగా తీసుకుంటే వేడి చేస్తుంది. కాబ‌ట్టి త‌గు మోతాదులో తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *