Core Web Vitals Assessment: Garlic benefits for health: ఆరోగ్యానికి వెల్లుల్లి చేసే మేలు మ‌రే డాక్ట‌రూ చేయ

Garlic benefits for health: ఆరోగ్యానికి వెల్లుల్లి చేసే మేలు మ‌రే డాక్ట‌రూ చేయ‌డ‌నుకుంటా!

Garlic benefits for healthవెల్లుల్లి చాలా ప్రాచీన‌మైన ఔష‌ధం, ఆయుర్వేదం దీనికి చాలా ప్రాముఖ్యానిచ్చింది. ల‌శున ప్ర‌భంజ‌నానాం శ్రేష్టం అని చెబుతూ, అన్ని వాత వ్యాధుల‌లోనూ దీనికి ఉప‌యోగించ‌వ‌చ్చున‌ని సూచిం చింది. అందుకే దీనిని సంస్కృతం లో మహాఔష‌ధి అని అంటారు. చిన్న చిన్న రుగ్మ‌త‌లైన ద‌గ్గు, జ‌లుబు, కడుపు ఉబ్బ‌రం, గొంతునొప్పి వంటి వాటిలో దీనిని గృహ వైద్యంగా వాడ‌వ‌చ్చు. వెల్లుల్లి వ‌ల‌న ఆరోగ్య‌ప‌ర‌మైన ఉప‌యోగాలు చాలా ఉన్నాయ‌ని ఇటీవ‌ల జ‌రిగిన అధ్య‌య‌నాలు (Garlic benefits for health)వెల్ల‌డించాయి.

ముఖ్యంగా గుండెకు ఇది మేలు చేస్తుంది. ర‌క్తంలో ప్లేట్‌లెట్స్‌ను పోగుప‌డ‌నీయ‌కుండా నిరోధిస్తుంది. ర‌క్త‌నాళాల‌లో ర‌క్తం ఆటంకం లేకుండా ప్ర‌వ‌హించ‌డానికి తోడ్ప‌డుతుంది. మ‌నిషి శ‌రీరానికి ఉప‌యోప‌డే హైడెన్సీటీ లిపో ప్రొటీన్ (హెచ్‌డిఎల్‌) కొలెస్ట‌రాల్‌ను పెంచ‌డ‌మే కాకుండా, శరీరానికి హాని క‌లిగించే లోడెన్సీటీ లిపో ప్రొటీన్ (ఎల్‌డిఎల్‌) కొలెస్ట‌రాల్ ను త‌గ్గిస్తుంది. దీని వ‌ల‌న ర‌క్త‌నాళాలు తేట‌గా ఉండ‌ట‌మే కాకుండా, గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు బాగా త‌గ్గిపోతాయి. ర‌క్త‌పోటును గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌డం ద్వారా గుండెపోటు నుండి గుండెను ర‌క్షిస్తుంది. అలాగే దీనిని అనునిత్యం వాడ‌టం వ‌ల‌న ప‌క్ష‌వాతం మొద‌లైన ర‌క్త ప్ర‌స‌ర‌ణ సంబంధ స‌మ‌స్య‌లుత్ప‌న్నం కావు.

వెల్లుల్లిలోని ఎల్లిసిన్ అనే పదార్థం ద్వారా దీనికి అన్ని ప్ర‌త్యేక‌త‌లు స‌మ‌కూరాయి. అయితే ఈ ప‌దార్థానికి ఘాటైన వాస‌న ఉంటుంది. సంహిత‌కారులు ఈ ల‌క్ష‌ణాన్ని ఆధారం చేసుకుని వెల్లుల్లికి ఉగ్ర‌గంధ అని మ‌రోపేరు పెట్టారు. వెల్లుల్లిని తినేట‌ప్పుడు ఈ ఎల్లిసిన్ న‌ష్టం చెంద‌కుండా ఉండాలంటే దానిని తాజాగా త‌రిగి కానీ, న‌లగ్గొట్టి గాని, వేడిచేసి గానీ ఉప‌యోగించాలి. వేడి అన్నం ముద్ద మ‌ధ్య పెట్టుకుని న‌మిలి మింగ‌వ‌చ్చు. స‌మ‌యం గ‌డిచేకొద్ది ఈ పదార్థం నిర్వీర్య‌మైన పోతుంది కాబ‌ట్టి పేస్టు, పొడి, వ‌డియాలు మొద‌లైన రూపాల్లో కాకుండా, తాజాగా వాడుకోవ‌డ‌మే ఉత్త‌మం.

వెల్లుల్లిలో గంధ‌క ర‌స‌యానాలు పెద్ద‌మొత్తంలో ఉంటాయి. వీటికి ఒక‌ర‌క‌మైన ఘాటు వాస‌న‌ను తెచ్చిపెట్టేవి ఇవే. ఈ ర‌సాయ‌నాలు ర‌క్త‌నాళాల్లో గార (ప్లాక్‌) పేరుకోకుండా కాపాడ‌తాయి. ఇక దీనిలోని అజోయేన్ ర‌క్తం గ‌ట్ట‌లు క‌ట్ట‌కుండా కాపాడుతుంది. అలిసిన్ అనేది యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌గా ప‌నిచేస్తుంది. ఇది ప‌లు ర‌కాల ఇన్ ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంద‌న్న‌మాట‌. ర‌క్త నాళాలు ముడుచుకుపోయేలా చేసే యాంజి యోటెన్సిన్ అనే ప్రోటీన్ ప‌నితీరునూ అలిస‌న్ అడ్డుకుంటుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ సాఫీగా జ‌రిగేలా చూస్తుంది.

వీటిల్లోని పాలీస‌ల్పైడ్లు శ‌రీరంలోకి వెళ్లాక హైడ్రోజ‌న్ స‌ల్పైడ్ వాయువుగా మార‌తాయి. ఇది ర‌క్త‌నాళాల‌ను సాగేలా చేసి ర‌క్త‌పోటు త‌గ్గ‌టానికి తోడ్ప‌డుతుంది. తరుచుగా జ‌లుబు బారిన‌ప‌డేవారు వెల్లుల్లిని రోజూ తీసుకుంటే మంచి ఫ‌లితం క‌న‌బ‌డుతుంది. మ‌న శ‌రీరం ఇనుమును గ్ర‌హించుకునేలా చేయ‌టంలో ఫెర్రోపోర్టిన్ అనే ప్రోటీన్ కీల‌క పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలోని డ‌యాలీల్ స‌ల్పైడ్లు ఈ ఫెర్రోపోర్టిన్ ప్రోటీన్ ఉత్ప‌త్తిని పెంచుతుంది. ఇది ఇనుము సంబంధ జీవ‌క్రియ‌లు మ‌రింత మెరుగ్గా సాగ‌టానికి తోడ్ప‌డుతుంది. వెల్లుల్లిలోని డ‌యాలీల్ స‌ల్పైడ్‌, థియాక్రెమో నోన్‌లు వాపు నివార‌కాలుగా ఉప‌యోప‌డ‌తాయి. ఇక ఆలీల్ స‌ల్పైడ్లు కొన్ని ర‌కాల క్యాన్స‌ర్ల నివార‌ణ‌కూ తోడ్ప‌తాయి.

ఉద‌య‌మే వెల్లుల్లి తీసుకుంటే..

  • జీర్ణాశ‌యంలోని బ్యాక్టీరియా న‌శిస్తుంది.
  • హై బీపీ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
  • ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌రుస్తుంది.
  • గుండె జ‌బ్బులు, డ‌యేరియాను త‌గ్గిస్తుంది.
  • మూత్రాశ‌య ప‌నితీరు మెరుగుప‌డుతుంది.
  • శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపును.
  • డిప్రెష‌న్‌, ఆస్త‌మా, ద‌గ్గు త‌గ్గిస్తుంది.
  • బ‌రువు త‌గ్గేందుకు స‌హ‌క‌రిస్తుంది.
  • బ్యాక్టీరియా, ఫంగ‌స్ ఇన్ఫెక్ష‌న్ల నుంచి పూర్తి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది.
Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *