Garikapadu check post

Garikapadu check post వ‌ద్ద త‌నిఖీల్లో ప‌ట్టుబ‌డ్డ మ‌ద్యం

Spread the love

Garikapadu check post: చిల్ల‌క‌ల్లు: జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం గ‌రిక‌పాడు చెక్ పోస్టు వ‌ద్ద వాహ‌నాల త‌నిఖీల్లో భాగంగా ఆదివారం తెలంగాణ నుండి ఆంధ్రా త‌ర‌లిస్తున్న 300 అక్ర‌మ మ‌ద్యం సీసాల‌ను ప‌ట్టుకున్న‌ట్టు నందిగామ డిఎస్పీ జి.నాగేశ్వ‌ర‌రెడ్డి అన్నారు. చిల్ల‌కల్లు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో సిఐ పి.చంద్ర‌శేఖ‌ర్‌, ఎస్సై పి.ర‌మేష్‌తో క‌లిసి వివ‌రాలు వెల్ల‌డించారు.

చిల్ల‌క‌ల్లు ఎస్సైకి వ‌చ్చిన స‌మాచారం మేర‌కు సిబ్బందితో క‌లిసి గ‌రిక‌పాడు చెక్‌పోస్టు(Garikapadu check post) వ‌ద్ద త‌నిఖీలు నిర్వ‌హించ‌గా ఏపీ05సిపి2079 నెంబ‌ర్ గ‌ల ట‌వేరా వాహ‌నంలో అక్ర‌మంగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న‌ట్టు గుర్తించామ‌న్నారు. వాహ‌నం సైడ్ డోర్ ల‌లో తెలంగాణ నుండి ఆంధ్రాలోని నందిగామ ప్రాంతానికి అక్ర‌మంగా త‌ర‌లిస్తుండ‌గా 300 మ‌ద్యం సీసాల‌ను ప‌ట్టుకున్న‌ట్టు తెలిపారు. వీటి ధ‌ర రూ.36,000/- ఉంటుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం, కోదాడ టౌన్ లోని న‌యాన‌గ‌ర్ కు చెందిన చింత‌ల ఈశ్వ‌ర్ అను అత‌న‌ని అదుపులోకి తీసుకున్నామ‌న్నారు. వాహ‌నాన్ని స్వాధీనం ప‌రుచుకొని, నిందితుడ‌పై కేసు న‌మోదు చేశామ‌న్నారు. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌నున్న‌ట్టు డిఎస్పీ జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెలిపారు.

Garikapadu check post : గ‌రిక‌పాడు చెక్‌పోస్టువ‌ద్ద ప‌ట్టుబ‌డిన కోటి రూపాయ‌లు

Garikapadu check post : గ‌రిక‌పాడు చెక్‌పోస్టువ‌ద్ద ప‌ట్టుబ‌డిన కోటి రూపాయ‌లుJaggaiahpet: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆంధ్రా-తెలంగాణ బోర్డ‌ర్ జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం గ‌రిక‌పాడు చెక్‌పోస్టు(Garikapadu check post) వ‌ద్ద Read more

Tiruvuru Revenue Division:తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్ స్వాగ‌తిస్తూ సంబురాలు!

Tiruvuru Revenue Division ఎ.కంభంపాడు: కృష్ణా జిల్లా నుండి విడిపోయిన ఎన్టీఆర్ జిల్లా (విజ‌య‌వాడ‌)లో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్‌ను ప్ర‌భుత్వం నిర్థారించింది. దీనిని Read more

Nuzvid Covid Cases: నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు

Nuzvid Covid Cases నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ Read more

pushpa lorry scene: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక మాఫియా ఆగ‌డాలు

pushpa lorry scene గ‌రిక‌పాడు: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక‌మాఫియా ఆగ‌డాలు ఏపీలో వెలుగు చూశాయి. ఏకంగా 11 ఇసుక లారీల‌ను ఆంధ్రా - తెలంగాణ స‌రిహ‌ద్దు Read more

Leave a Comment

Your email address will not be published.