Garika Muntha

Garika Muntha: వివాహ స‌మ‌యంలో గ‌రిక ముంత ప్రాముఖ్య‌త ఏమిటి?

Special Stories
Share link

Garika Muntha: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, రాయ‌ల‌సీమ‌లోనూ, తెలంగాణ‌లోనూ, క‌ర్ణాట‌క‌లోనూ క‌ర‌గ అనే పేరుతోనూ త‌మిళంలో క‌ర‌గం అనే పేరు తోనూ, ఇత‌ర ఆంధ్ర ప్రాంత గ‌రికె, గ‌రిక‌, గ‌రిగ‌, గ‌రిగె అనే పేర్లుతోనూ ప్ర‌చారంలో ఉంది. గ‌రిగ‌ల‌ను సేవించ‌డం ద్వారా అమ్మ‌వారిని సేవించిన‌ట్టే భావింప‌ బ‌డుతుంది. గ‌రిక అంటే కుండ అని అర్థం. ద్రౌప‌ది త‌న వివాహ స‌మ‌యంలో ఆనందావేశంతో ప్ర‌క్క‌నున్న క‌ల‌శాన్ని నెత్తిన పెట్టుకుని చిందులు వేసింద‌నీ, ఆ విధంగా అది ప‌విత్రం పొందింద‌నీ అంటారు.

ఈ నాటికీ వివాహ స‌మ‌యంలో అన్ని ప్రాంతాల‌లోనూ గ‌రికె ముంత‌, గ‌రిక బుడ్డి(gariga buddi) ముంత‌, పెండ్లి స‌మ‌యాల‌లో కుమ్మ‌రి వారు అలివేణి కుండ‌ల‌తో పాటు ఈ గ‌రిగె ముంత‌ను కూడా అందంగా రంగుల‌తో చిత్రిస్తారు. దీనిని ఎంతో పవిత్రంగా చూస్తారు. గ‌రికె ముంత లేకుండా వివాహం జ‌రుప‌రు. ఆ ముంత‌లో పూజా విధాన ముగింపుతో దానిని తాకించి, మంత్రాలు చ‌దువుతారు.

గ‌రిగె ముంత

ఈ Garika Muntha (బుడ్డి)ను పెండ్లికి ముందు రోజే కుమ్మ‌రి ఇంటి నుండి మేళ తాళాల‌తో వెళ్లి కుమ్మ‌రి వారికి కానుక‌లు చెల్లించి ఇంటికి తెచ్చి ఒక గ‌దిలో వుంచి దీపారాధ‌న చేసి పూజిస్తారు. ముందుగా ఈ గ‌రిగెల‌ను పూజించ‌టం గౌరి పూజ‌గా భావిస్తారు. అంటే పెండ్లిండ్ల‌లో గ‌రిగె గౌరీమాత‌కు ప్ర‌తీక‌గా పూజ నందు కుంటుంది. వివాహ స‌మ‌యంలో గ‌రిగెను దంప‌తుల ముందుంచి మ‌ర‌ల పూజచేసి, వివాహాన్ని పూర్తి చేస్తారు. వివాహం జ‌రిగినంత సేపూ గ‌రిగె ముంత ఎంతో ప్రాముఖ్యం వ‌హిస్తుంది. వ‌ధువు అత్త‌గారింటికి వెళ్లే ముందు ఈ Garika Muntha ను వ‌ధువుతో పంపించి పెండ్లి త‌రువాత కూడా దానిని ప‌విత్రంగా చూస్తారు. గ‌రిక ముంతే గ‌ర‌గా మారిందంటారు.

See also  Bilkis Bano #బిల్కిస్ బానో కి జ‌రిగింది న్యాయ‌మేనా?

Leave a Reply

Your email address will not be published.