Free Milk: ఈ కాలంలో పాలు ఎవరైనా ఉచితంగా పోస్తారా? ఉచితంగా పోయమని మన ఊరిలో అడిగే ధైర్యం ఎప్పుడైనా చేశారా? పాల వ్యాపారంతో కోట్ల కూడబెట్టిన వారు ఉన్నారు. లక్షల రూపాయలతో ఇళ్లు కట్టుకున్నవారు కూడా ఉన్నారు. అసలు పశువులను పెంచేదే పాలు అమ్ముకోవడానికి కదా! అనే జవాబు కూడా రాకపోదు. కానీ! ఇప్పుడు చెప్పబోయే స్టోరీ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే? మీరే చదవండి ఒకసారి!.
Free Milk: పచ్చని పొలాల మధ్య కనుచూపు మేరలో కనిపించే అందమైన పల్లెటూరే గంజిహళ్లి గ్రామం. ఈ ఊరు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని ఉన్నది. ఈ గ్రామంలో సుమారు వెయ్యి ఇళ్లు ఉంటాయి. ఇక్కడ నివసించే వారు దాదాపు అందరూ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారే.ఇక్కడ కుటుంబాల వారికి ఎంతో కొంత పొలం, పశువులు ఉన్నాయి. ఈ గ్రామం ప్రత్యేక ఏమిటంటే, ఈ ఊరిలో ఎవ్వరూ కూడా పాలు అమ్మరట.


చాలా మంది ఇళ్లల్లో పాడి సమృద్ధిగా ఉంటుంది. కానీ ఎవరూ కూడా పాలతో వ్యాపారం చేయరు. ఎవరికైనా కావాలంటే మాత్రం ఉచితంగా పోస్తారు కానీ డబ్బలు మాత్రం తీసుకోరు. ఎంత కరువు వచ్చినా సరే కష్టమొచ్చినా సరే తాతాల నాటి సాంప్రదాయంలో భాగంగా వందల ఏళ్ల నుంచి పాలు అమ్ముకోరు. ఓ కిరాణా షాపు వద్దకు వెళ్లి పాల పాకెట్ కొనాలన్నా కూడా అక్కడ ఉండవు. వారు కూడా పాలు మాత్రం ఉచితంగానే పోస్తాం అని సమాధానం చెబుతున్నారు.
వెంకమ్మ అనే కుటుంబ యజమానికి 12 గేదెలు ఉన్నాయి. తన పశువుల ద్వారా రోజుకు 16 లీటర్లు పాలు వస్తాయి. వారి ఇంటి అవసరానికి ఒకటి, రెండు లీటర్లు పాలు ఉంచుకోని మిగతా లీటర్ల పాలును ఎవరికైనా అవసరం అని వస్తే ఉచితంగా పోస్తానని చెబుతున్నారు. ఇలా ఊరిలో ఒక్క వెంకమ్మ గారే ఇలా చేయరు. ఊరిలో అందరూ ఇలానే పాలు, పెరుగు ఉచితంగా పోస్తారు. ఇది తమ పెద్దల నుంచి వచ్చిన ఆచారమని చెబుతున్నారు.
ఇంతకూ ఎవరు ఆ పూర్వీకులు అంటే?


17వ శతాబ్ధానికి చెందిన బడే సాహెబ్ అప్పట్లో ఆ ఊరి మేలుకోరి ఎన్నో ఉపదేశాలు చేశారని, అందులో ముఖ్యమైనవి గోవధ నిషేధం, పాల అమ్మకం నిషేధం అని ఆ ఊరి స్థానికులు చెబుతున్నారు. ఒక వేళ ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా నడిస్తే వారికి అరిష్టాలు తప్పవని ఆ ఊరి జనం నమ్మకంగా భావిస్తారు. ఈ ఊరిలో బడేసాహెబ్ సమాధి ఇక్కడే ఉందట. అక్కడ ఒక దర్గా కూడా వెలిసింది. ఈ దర్గాను దర్శించటానికి చుట్టుప్రక్కల నుండి జనాలు కూడా వస్తుంటారు. బడేసాహెబ్ చెప్పిన నిబంధనలను ఆ ఊరి జనాభా తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారు. కుల, మతాలకు అతీతంగా ఇప్పటికీ బడే సాహెబ్‌ను కొలుస్తుంటారు. ఆయన వంశానికి చెందిన 8వ తరం ఇప్పుడు ఈ దర్గా బాధ్యతలను చూసుకుంటోంది. నిజంగా గంజిహళ్లి గ్రామం గ్రేట్ కదా!.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్