Copper wire

Copper wire : కాఫ‌ర్ చోరీ ముఠా అరెస్ట్‌

Spread the love

Copper wire : గ‌త కొద్ది రోజుల క్రితం ఓ ప‌రిశ్ర‌మ‌లో చోరీకి గురైన కాప‌ర్ వైర్ చోరీ చేసిన దొంగ‌లు దొరికారు. ప్ర‌త్యేక త‌నిఖీలు ఏర్పాటు చేసిన పోలీసుల‌కు ఎట్ట‌కేల‌కు చోరీ చేసిన ముగ్గురు దొరికారు.


Copper wire : చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు మండ‌లంలోని ఆరూరు చెక్‌పోస్టు వ‌ద్ద వాహ‌న‌త‌నిఖీలు నిర్వ‌హించిన ఎస్ఐ అరుణ్ కుమార్‌ రెడ్డి చోరీకి పాల్ప‌డిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వ‌ద్ద నుండి రూ.ల‌క్షా 50 వేలు విలువ చేసే 80 కేజీల కాఫ‌ర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల ప్ర‌కారం శ్రీ సిటీలోని ఉత్త‌మాకి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప‌రిశ్ర‌మ‌లో కాఫ‌ర్ చోరీ జ‌రిగింద‌ని గ‌త నెల 23న ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. శ్రీ‌సిటీ డిఎస్పీ జ‌గ‌దీష్ నాయ‌క్‌, సిఐ శ్రీ‌నివాసులు ఆదేశాల మేర‌కు ఎస్ఐ అరుణ్‌కుమార్ రెడ్డి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఆరూరు చెక్‌పోస్టు వ‌ద్ద సిబ్బందితో క‌లిసి వాహ‌న‌త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా చోరీకి పాల్ప‌డిన ముగ్గురిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించిన‌ట్టు ఎస్సై తెలిపారు.

త‌మిళ‌నాడు తిరువ‌ళ్లూరు జిల్లా పాల‌వాకంకు చెందిన యువ‌రాజ్‌, భ‌ర‌త్‌, డేవిడ్ అనే ముగ్గురిపై కేసు న‌మోదు చేసి రిమాండ్ కు త‌ర‌లించామ‌ని తెలిపారు. ఈ కేసు ద‌ర్యాప్తులో ఏఎస్సై ష‌ణ్ముగం, హెడ్ కానిస్టేబుల్ హ‌రిబాబు, శ్రీ‌నివాసులు, కానిస్టేబుల్ కిర‌ణ్‌, ద‌యాక‌ర్‌, హ‌రీష్‌, ప్ర‌హ్లాద్‌, రాజు పాల్గొన్నారు.

LED Tv Chepest Price: రూ.500 కే టివీ అంట‌..ఆరా దీస్తే!

Jaggayyapeta : కృష్ణా జిల్లాలో విచిత్ర‌మైన దొంగ‌త‌నం బ‌య‌ట‌ప‌డింది. రూ.500 కే టీవీ అమ్ముతుంటే పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే దిమ్మ తిరిగే Read more

Kavali: Police arrested two theif | kavali news in telugu | దేవాల‌యాల్లో హుండీలే వాళ్ల టార్గెట్‌

kavali : గ‌త కొన్ని రోజులుగా ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న దేవాల‌యాల్లో హుండీలు చోరీకి గుర‌వ్వ‌తున్నాయి. ఈ కేసు విష‌యంలో స్థానిక పోలీసులు నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం స‌వాల్‌గా Read more

TTD Fake Webistes: టిటిడి టిక్కెట్లు అమ్మే ఫేక్ వెబ్‌సైట్ల‌పై పోలీసుల కొరఢా!

TTD Fake Webistes చిత్తూరు: పోలీసుల దృష్టి వెంక‌న్న స్వామి భ‌క్తుల ప‌రిర‌క్ష‌ణ‌పై పడింది. ఫ‌లితంగా తిరుమ‌ల స్వామివారి ద‌ర్శ‌నానికి టికెట్ల‌ను అమ్ముతాం అంటున్న 39 ఫేక్ Read more

Kalicherla Prabhakar reddy: తంబ‌ళ్ల‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే మృతి

Kalicherla Prabhakar reddy chittoor:తంబ‌ళ్ల‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే క‌లిచెర్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి సోమ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు బెంగ‌ళూరు సెన్ జాన్స్ ఆస్ప‌త్ర‌లిలో తుది శ్వాస విడిచారు. Read more

Leave a Comment

Your email address will not be published.