Gang arrested for scams to get jobs in Anantapur | హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో వసూలు మోసాలకు పాల్పడే ముఠాను అరెస్టు చేసిన అనంతపురం పోలీసులు
Anantapur : నకిలీ ఆర్డర్ కాపీలతో అమాయక నిరుద్యోగులను నమ్మించి హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేసిన ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ముఠాను అనంతపురం జిల్లా నార్పల పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన ముగ్గుర్ని అరెస్టు చేశారు.
జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమాయక నిరుద్యోగ యువతీ, యువకులను టార్గెట్ చేసుకుని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో లక్షల రూపాలయు వసూలు చేసిన ముఠాను పట్టుకున్నామని తెలిపారు. ఉద్యోగా లిప్పిస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు దండుకునే మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలన్నీ పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారని అన్నారు. నిరుద్యోగులను ఉచ్చులోకి దించే మోసగాళ్ల వంచనల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అసలే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుంటే ఈ తరహా మోసగాళ్ల వల్ల నిరుద్యోగులు ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో పాటు కెరీర్ నాశనమవుతుందని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మాకు ఉన్నతాధికారులు తెలుసు. ప్రజా ప్రతినిధులతో బాగా పరిచయాలున్నాయి. సులువుగా ఉద్యోగాలు ఇప్పిస్తాం. అంటూ నమ్మబలుకుతూ మాయమాటలు చెప్పేవారి గురించి జిల్లా పోలీసు వాట్సాప్ నెంబర్ 9989819191 లేదా డయల్ 100కు సమాచారం చేరవేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఇది చదవండి:మోగిన స్థానిక సంస్థల ఎన్నికల గంట! మరి సజావుగా నడిచేనా?
ఇది చదవండి:ముదురుతున్న స్థానిక సంస్థల ఎన్నికల “రాజకీయ” పంచాయతీ
ఇది చదవండి:విధి నిర్వహణలో గీత దాటని తల్లి!
ఇది చదవండి :వ్యాక్సిన్ వేసుకున్నట్టు ఫొటోలకు పోజులిచ్చి దొరికిపోయారు (వీడియో)