Gandhiji quotes | మహాత్ముని గురించి అందరికీ తెలుసు. ఆయన ప్రబోధించిన అహింసా సిద్దాంతం దేశానికి స్వాతంత్య్రం సంపాదించడమే కాదు, విదేశాల్లోనూ ఖ్యాతిని పొందింది. Satyagraham అత్యంత శక్తివంతమైన ఆయుధంగా పేరొందింది. అలాంటి ఆయుధాన్ని ప్రసాదించిన Jaathi Pitha యువతను ఉద్దేశించి ఏమన్నాడో తెలుసుకుందాం.
Mahatma Gandhi చెప్పిన నీతి(Gandhiji quotes) వాక్యాలు
రేపు చనిపోతున్నట్టుగా జీవించు. శాశ్వతంగా బ్రతికి ఉండటం నేర్చుకో.
భయం శారీరకమైన జబ్బు కాకపోవచ్చు. కానీ ఆత్మను హతమారుస్తుంది.
శక్తి శారీరకమైన సామర్థ్యం నుంచి రాదు, మనసులోని కోరిక నుంచి వస్తుంది.
నీ అంగీకారం లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు.
బలహీనుడిలో క్షమాగుణం ఎప్పటికీ కనిపించదు. అది బలవంతుడి లక్షణం.
ప్రపంచంలో నేను ఒకే ఒక నియంతను అంగీకరిస్తాను…అంతరాత్మ
నా ఇంటి కిటికీలు మూసి ఉండాలని నేనెప్పుడూ కోరుకోను. భిన్నదేశాల సంస్కృతుల పవనాలు వాటి గుండా స్వేచ్ఛగా ప్రయాణించాలి. అలాగని నా కాళ్లు లాగేస్తానంటే నేనొప్పుకోను. ఇతరుల ఇంట్లో బానిసలా, బిచ్చగాడిలా ఉండటాన్ని కూడా అంగీకరించను.
మానవ సమాజం, మనస్సులు, మత, రాజకీయ, సామాజిక అడ్డుగోడలతో విభజింపబడకూడదు.
భవిష్యత్తు గురించి ఆలోచించడం కంటే ఈ క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడమే నాకు ఇష్టం.
అధికారం రెండు రకాలు. భయపెట్టి సంపాదించేది, ప్రేమతో పొందేది. ప్రేమతో వచ్చే అధికారం, భయంతో వచ్చేదాన్ని కన్నా శక్తివంతమైనది.
ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు.
ప్రతీ ఒక్కరూ అంతర్గతంగా ప్రశాంతతను కనుగొనాలి. నిజమైన శాంతి బాహ్య పరిస్థితులకు ప్రభావితం కాదు.
Mahatma Gandhi poem
ఓ బాపూ నువ్వే రావాలి
నీ సాయం మళ్లీ కావాలి
జరిగే దుర్మార్గాన్నాపాలి
నువ్వే ఓ మార్గం చూపాలి
బక్క పలుచని బాపు గుండెలో
ఆసేతు హిమాచలం
ఉక్కు నరాల్లో ఉప్పొంగే
స్వాతంత్య్ర రక్త గంగాజలం
అతడంటే గడగడ వణికింది
అంగ్లేయుల సింహాసనం