gandhi hospital

gandhi hospital: సర్కార్ ఆసుప‌త్రికి స‌లాం! గాంధీ ఆస్ప‌త్రి సేవ‌లు ఘ‌నం!

Spread the love

gandhi hospital హైద‌రాబాద్:పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఈ మాత్రం ఆరోగ్యంగా జీవిస్తున్నారంటే అది స‌ర్కారు ఆసుప‌త్రుల పుణ్య‌మే అని చెప్పుకోవాలి. రెండు సంవ‌త్స‌రాలుగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌తి మ‌నిషిని వెంటాడింది. ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు చేస్తున్న సేవ‌లు అభినందించ‌ద‌గిన‌వి. క‌రోనా రోగులు ఆసుప‌త్రుల్లో చేర‌గా కొంద‌రు కోలుకున్నారు. మ‌రికొంద‌రు ప్రాణాలు విడిచారు. క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డిన ప్ర‌తి వ్య‌క్తి ముందుగా స‌ర్కారు ఆసుప‌త్రికి చేతులెత్తి మొక్కే రోజులు వ‌చ్చాయి. నిజంగా ప్ర‌భుత్వ ఆసుప‌త్రులే లేక‌పోతే మ‌నుషులు పిట్ట‌ల్లా రాలిపోయి ఏ ఒక్క మ‌నిషి మిగ‌ల‌కుండా (gandhi hospital)ఉండేవాడు.

ఇదిలా ఉండ‌గా ఈ నేప‌థ్యంలో మ‌న దేశంలో ఎక్కువ మంది క‌రోనా రోగులకు చికిత్స చేసిన ఆస్ప‌త్రిగా తెలంగాణ రాష్ట్రంలోని న‌గ‌రంలో ఉన్న గాంధీ ఆసుప‌త్రి మొద‌టి స్థానంలో నిలిచింది. దేశంలో కోవిడ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి మొద‌లు అంటే ఫ‌స్ట్ వేవ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలో 84,127 మంది రోగుల‌కు చికిత్స అందించిన‌ట్టు వైద్యులు వెల్ల‌డించారు. భార‌త దేశంలో మ‌రే ఇత‌ర ఆస్ప‌త్రిలో ఇంత మంది రోగులు చికిత్స పొంద‌లేద‌ట‌. కోవిడ్ చికిత్స పొందిన వారిలో 3,762 మంది 14 ఏళ్ల లోపు చిన్నారులు కూడా ఉన్నారు.

అదే విధంగా హైరిస్కు గ్రూపుకు చెందిన 8,178 మంది డ‌యాల‌సిస్ రోగులు కూడా ట్రీట్‌మెంట్ పొందారు. మ‌రోవైపు కోవిడ్‌తో పాటు ప్ర‌జ‌ల‌కు ద‌డ పుట్టించిన బ్లాక్ ఫంగ‌స్ వ్యాధికి కూడా గాంధీ ఆస్ప‌త్రి వైద్యులు చికిత్స అంద‌జేశారు. బ్లాక్ ఫంగ‌స్ బాధితులు 1,786 మంది రాగా వారిలో 1,168 మందికి స‌ర్జ‌రీలు చేసి వారి ప్రాణాల‌ను కాపాడిన‌ట్టు వైద్యులు తెలిపారు. బ్లాక్ ఫంగ‌స్ పేషెంట్ల‌లో ఏపీ, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర నుంచి ఎక్కువుగా వ‌చ్చిన‌ట్టు వారు వివ‌రించారు.

Congress party Foundation day:కాంగ్రెస్ పోరాడింది కాబ‌ట్టే దేశం ప్ర‌శాంతంగా ఉంది: మ‌ల్లుభ‌ట్టి

Congress party Foundation day ఖ‌మ్మం: కాంగ్రెస్ పార్టీ పోరాట ఫ‌లితమే దేశానికి స్వాంతంత్య్రం, భార‌త రాజ్యాంగం ల‌భించాయ‌ని తెలంగాణ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత మ‌ల్లు భ‌ట్టి Read more

MLC Kavitha: కొండ ఎక్కినా.. ఏ బండ మొక్కినా రాష్ట్రం కోస‌మే

MLC Kavithaజ‌గిత్యాల: కొండ‌గ‌ట్టు ఆంజనేయ స్వామిని ఎమ్మెల్సీ క‌విత ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ అంజ‌న్న ఆల‌య అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు Read more

saidabad rape case: దుండగుడిని కఠినంగా శిక్షించాలి:డివైఎఫ్ఐ

saidabad rape case రఘునాధపాలెం: హైదరాబాద్ లో 6 సంవ‌త్స‌రాల‌ చిన్నారి చైత్ర భాయ్ పై అత్యాచారం చేసి,హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించి, చిన్నారి కుటుంబానికి Read more

Teenmaar Mallanna Press Meet: తెలంగాణ‌లో యుద్ధం మిగిలే ఉందంటున్న తీన్మార్ మ‌ల్ల‌న్న

త‌న‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు!టిఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించుతాం!నాగార్జునసాగ‌ర్ ఉప ఎన్నిక‌లో పోటీ? Teenmaar Mallanna Press Meet: Nalgonda : నాకోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డి Read more

Leave a Comment

Your email address will not be published.