Gampalagudem | తోటమూల(గంపలగూడెం): సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఆధునిక కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలకు బలౌతున్నారని జేవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ వారోత్సవాలలో భాగంగా గురువారం స్థానిక ఏ పి ఆదర్శ ఉన్నత పాఠశాల,సరస్వతి ఉన్నత పాఠశాలల్లో జరిగిన సైన్స్ అవగాహన సదస్సులలో(Thotamula) ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ శాస్త్రీయ ఆలోచనలు పెంచుకోవాలని సూచించారు. సందర్భంగా జేవివి నాయకులు కె.పాపారావు చేసిన ఇంద్రజాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.వివిధ ప్రిన్సిపాల్స్ కె.మేరీ ప్రతిష్ఠ, వై. వెంకటేశ్వరరెడ్డి, జేవివి నాయకులు యం.రాం ప్రదీప్, కె.శేషగిరి,విద్యార్థులు(Gampalagudem) పాల్గొన్నారు.
Chintala Padu:చింతలపాడులో రైతుల రాస్తారోకో!

అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కౌలు రైతులు, రైతులు ఈ సంవత్సరం మిర్చి వేసి తీవ్రంగా నష్టపోయామని అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో చింతలపాడు సెంటర్ నందు రాస్తారోకో నిర్వహించి అక్కడ నుండి ర్యాలీగా సచివాలయం దగ్గరికి వెళ్లి ధర్నా చేశారు. ఈ ధర్నాకు ఏ కొండూరు మండల రైతు సంఘం నాయకులు అమ్మి రెడ్డి , కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ఏం ప్రభాకర్ రావు, కాంగ్రెస్ కిసాన్ నాయకులు శ్రీనివాస రావు, రైతు సంఘం మండల కార్యదర్శి ఇ ఎస్ వెంకటేశ్వర్లు, రైతులు శ్రీను వలరాజు కౌలు రైతులు ఆనందరావు, లక్ష్మణరావు, సురేష్, ప్రజా సంఘాల నాయకులు ఆకుల రవి .బి వెంకటేశ్వరరావు నాగుల్ మీరా పాల్గొన్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!