Gadwal Reddy bidda: సోషల్ మీడియాలో ఒకే ఒక్క వీడియోతో సంచలన్మాతకంగా వైరల్ అయిన గద్వాల్ బిడ్డా అలియాస్ మల్లికార్జున రెడ్డి అనే యువకుడు ఆదివారం చనిపోయారు. అతను అనారోగ్యంతో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లికార్జున రెడ్డి చిన్న తనం నుండే ఆస్తమాతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అతని స్వగ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె గ్రామం. సోమవారం మల్లికార్జున రెడ్డి అంత్యక్రియలు స్వగ్రామమైన జిల్లేడు దిన్నెలో జరిగాయి. యువకుడు మరణంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన అతనితోనే బర్త్‌డే కేక్‌ను కట్ చేయించారు కుటుంబ సభ్యులు. ఇది చూసిన వారు కంట తడి పెట్టారు.
వివాదస్పదమైన మల్లికార్జున రెడ్డి వీడియో!
నువ్వెనివో నాకు తెల్వదు…మా జోలికి వస్తే కబడ్దార్ బిడ్డా..! నేను గద్వాల్ రెడ్డి బిడ్డా (Gadwal Reddy bidda)అంటూ తెలిసీ తెలియక చేసిన వీడియోతో వైరల్‌గా మారాడు మల్లికార్జున్ రెడ్డి. రాంగోపాల్ వర్మపై వీడియో చేయగా అది వైరల్ అయ్యింది. కొన్ని వివాదాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దళితులను కించ పరుస్తూ మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. దీనిపై దళిత సంఘాలు సీరియస్ కావడంతో మల్లికార్జున రెడ్డి క్షమాపణలు కోరాడు. మొత్తంగా అందరికీ పరిచయం అయ్యి సోషల్ మీడియాలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గద్వాల్ రెడ్డి బిడ్డ ఇలా అకాల మరణం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.

- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి